Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టీజ‌ర్ : సిగ్గెందుకు ఉండిపోయిందో అర్థ‌మైంద‌ట‌!

By:  Tupaki Desk   |   14 Sep 2022 10:59 AM GMT
ట్రైల‌ర్ టీజ‌ర్ : సిగ్గెందుకు ఉండిపోయిందో అర్థ‌మైంద‌ట‌!
X
ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు, హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ సోద‌రుడు బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న మూవీ 'స్వాతిముత్యం'. వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా న‌టించింది. ల‌క్ష్మ‌ణ్ కె. కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ మూవీ విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కాబోంది. గురువారం హీరో బెల్లంకొండ గ‌ణేష్ పుట్టిన రోజు.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం స్పెష‌ల్ టీజ‌ర్ ట్రైల‌ర్ పేరుతో ఓ వీడియోని విడుద‌ల చేసింది. 'మ‌న బాల ఏం చేశాడో కొంచెం మీకు అర్థ‌మ‌య్యేలా చెబుతాను' అంటూ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ వాయిస్ తో టీజ‌ర్ మొద‌లైంది.

'కొంప‌దీసి ఏదైనా ప్రాబ్ల‌మా? .. అని హీరోయిన్ అడిగితే 'ప్లాబ్ల‌మ్ ప్రాబ్ల‌మ్ ఏముంట‌దండి' అని హీరో అన‌డం.. ఫైన‌ల్ గా మీకు సిగ్గుదేనికి వుండిపోయిందో నాకు ఇప్పుడ‌ర్థ‌మైంది' అని హీరోయిన్ అన‌డం ఆక‌ట్టుకుంతోంది. రొటీన్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్ లా కాకుండా భిన్నంగా ఈ మూవీని తెర‌కెక్కించినట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఆద్యంతం వినోదాత్మ‌కంగా 'స్వాతిముత్యం'ని రూపొందించారు. అందురు హీరోల్లా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీతో కాకుండా కొంత భిన్న‌మైన సినిమాతో బెల్లంకొండ గ‌ణేష్ వ‌స్తుండ‌టంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అత‌ని గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకుంటున్నారు. సినిమా ఎప్పుడో పూర్త‌యి రిలీజ్ కి సిద్ధంగా వున్నా వ‌రుస‌గా భారీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీని వ‌రుస‌గా వాయిదా వేస్తూ వ‌చ్చారు.

ఫైన‌ల్ గా ద‌స‌రా రేసులో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాద‌ర్‌', కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్' రిలీజ్ అవుతున్నా వెన‌క్కి త‌గ్గ‌కుండా 'స్వాతిముత్యం'ని ద‌స‌రా బ‌రిలో దించేస్తున్నారు. తొలి సినిమా రిలీజ్ కు ముందు బెల్లంకొండ గ‌ణేష్ మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించేశాడు.

త‌ను న‌టిస్తున్న రెండ‌వ మూవీ 'నేను స్టూడెంట్ స‌ర్‌'. 'స్వాతిముత్యం'లో పేరుకు త‌గ్గ‌ట్టే క‌నిపించిన బెల్లంకొండ గ‌ణేష్ 'నేను స్టూడెంట్ స‌ర్‌'. మూవీలో స్టూడెంట్ గా క‌నిపించ‌బోతున్నాడు. రాఖీ ఉప్ప‌ల‌పాటి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.