Begin typing your search above and press return to search.

శృతి హాసన్ వేయట్లే? నేనేస్తే తప్పేంటి?

By:  Tupaki Desk   |   5 Aug 2016 9:30 AM GMT
శృతి హాసన్ వేయట్లే? నేనేస్తే తప్పేంటి?
X
యూట్యూబ్ లో సెన్సేషన్స్ చేస్తున్న తెలుగు అమ్మాయిల్లో స్వాతి నాయడు కూడా ఉంటుంది. ఇప్పటికే తెలుగు పోర్న్ స్టార్ అనే బిరుదు కూడా దక్కించేసుకుందంటే.. ఈమె అందాలు హావభావాల డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈమె ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఇందులో తన లైఫ్ గురించి చాలానే ఆసక్తికరమైన సంగతులు చెప్పిన స్వాతి నాయుడు.. సౌత్ బ్యూటీ శృతిహాసన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఇలాంటి మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేస్తూ పోర్న్ టైపు సినిమాలు చేయడం బాధ అనిపించదా అన్నది స్వాతి నాయుడికి ఎదురైన ప్రశ్న. 'నాకు కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఆయన కూతురు శృతి హాసన్ ఉంది. వాళ్లే డబ్బులు పెట్టుకుని పద్ధతిగా చక్కగా కనిపించేలా సినిమాలు చేయచ్చు. కానీ శృతి మాత్రం లోనెక్ జాకెట్స్ వేసుకుంటూ ఎక్స్ పోజింగ్ చేస్తున్న పాత్రలు కూడా చేయడానికి కారణం.. ఆమె ఆలోచనలే. అంత పెద్ద స్టార్ కూతురు అయినా ఆమె అలాంటి డ్రస్సులు వేస్తే లేని తప్పు.. నేను చేసినప్పుడు ఎందుకు అవుతుంది?' అంటూ నిలదీసింది స్వాతి నాయుడు.

ఈ మధ్యనే ఈ పోర్న లేడీ క్యాంపస్ అంపశయ్య అనే సినిమాలో న్యూడ్ గా నటించి సంచలనం కలిగించింది. కాకపోతే విషయం ఏంటంటే.. హాటుగా టూ పీస్ బికినీలో నటించడం వేరు.. అదే టూ పీస్ లో సెక్స్ సీన్ చేయడం వేరు. జనాలు పాయింటవుట్ చేస్తున్న తేడా అదే!!