Begin typing your search above and press return to search.

BB4 వైల్డ్ కార్డ్ బ్యూటీ ఓ హిట్ మూవీలో హీరోయిన్ గా చేయాల్సింది...?

By:  Tupaki Desk   |   25 Sep 2020 3:04 PM GMT
BB4 వైల్డ్ కార్డ్ బ్యూటీ ఓ హిట్ మూవీలో హీరోయిన్ గా చేయాల్సింది...?
X
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 4 లో మూడో వైల్డ్ కార్డ్ గా హీరోయిన్ స్వాతి దీక్షిత్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బెంగాలీ తమిళ్ చిత్రాల్లో నటించిన స్వాతి తెలుగులో 'బ్రేకప్' 'జంప్ జిలానీ' 'లేడీస్ అండ్ జెంటిల్‌ మెన్' 'చిత్రాంగద' తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆమె నటించిన 'పట్టపగలు' అనే సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపులేని స్వాతి దీక్షిత్ కి.. టాలీవుడ్ లో ఇప్పుడుప్పుడే త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న యువ హీరోకి ఓ లింక్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా, రెండేళ్ల క్రితం ఓ సెన్సేషనల్ హిట్ సినిమాతో హీరో హీరోయిన్లు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్ కైతే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కాయి. అయితే నిజానికి ఈ క్యారక్టర్ స్వాతి దీక్షిత్ చేయాల్సిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు టీమ్ అంతా ఓ ట్రయిల్ షూట్ ప్లాన్ చేసుకున్నారట. దీని కోసం స్వాతి దీక్షిత్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటామని మాటిచ్చి.. హాట్ హాట్ కిస్ సీన్స్ లో నటింపజేసి సినిమాకి ఓ ట్రైల‌ర్ మాదిరి క‌ట్ చేశారట. అయితే చివరకు సినిమాలో స్వాతిని హీరోయిన్ గా తీసుకోకుండా.. మరో కొత్త బ్యూటీని తీసుకున్నారు. కాకపోతే ఈ విష‌యాన్ని స్వాతి దీక్షిత్ లైట్ తీసుకుందని తెలుస్తోంది. మరి అమ్మడికి 'బిగ్ బాస్ - 4' తో మంచి అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.