Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: డేరింగ్ అందాల స్వర

By:  Tupaki Desk   |   5 Jun 2018 5:09 AM GMT
ఫోటో స్టోరీ: డేరింగ్ అందాల స్వర
X
బాలీవుడ్ భామ స్వర భాస్కర్ దాదాపు పదేళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ బ్యూటీకి బుల్లితెరపై వెలిగిన అనుభవం కూడా బాగానే ఉంది. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న ఈ ఢిల్లీ భామ.. ఇప్పుడు వీరే ది వెడ్డింగ్ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

మరీ స్ట్రెయిట్ గా మహిళల ఫీలింగ్స్ ను చూపించేయడం.. వైబ్రేటర్ తో స్వరభాస్కర్ స్వయంతృప్తి పొందుతున్న సన్నివేశం ఉండడం వంటివి.. ఈమె డేరింగ్ ను చాటుతాయి. అందంతో పాటు తెగువ కూడా ఉన్న స్వర భాస్కర్ కు తెలివితేటలు కూడా ఎక్కువే. అందుకే తనపై పెయిడ్ ట్రాలింగ్ జరుగుతోందనే విషయాన్ని సాక్ష్యాలతో పాటు చూపించగలిగింది. ఇప్పుడీ భామ ఏకంగా కవర్ పేజ్ సుందరాంగిగా కూడా మారిపోయింది. మ్యాన్స్ వరల్డ్ ఇండియా మేగజైన్ కు ఫోటో షూట్ చేసిన స్వర భాస్కర్.. తన సోయగాల మెరుపులను తెగ కుమ్మరించేసింది.

తన స్కిన్ టోన్ కు కాసింత దగ్గరగా ఉన్న డ్రెసింగ్ చేసుకున్న స్వర భాస్కర్.. డీప్ క్లీవేజ్ ను ఆరబోస్తూ.. ఇచ్చిన పోజ్ మరీ సెక్సీగా ఉంది. దీనికి తోడు తెలివి.. అందం.. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేని తత్వం.. అనే అర్ధం వచ్చేలా పెట్టిన క్యాప్షన్స్.. స్వర భాస్కర్ స్థైర్యాన్ని చాటుతాయి. గత నాలుగేళ్లుగా ఏడాదికో సినిమా చేస్తూ సరిపెట్టుకుంటున్న ఈ 30 ఏళ్ల భామ.. వీరే ది వెడ్డింగ్ తర్వాత స్పీడ్ పెంచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.