Begin typing your search above and press return to search.

న్యూడ్ సీన్ లీక్.. ఎవరు చేశారు?

By:  Tupaki Desk   |   2 March 2017 11:31 AM GMT
న్యూడ్ సీన్ లీక్.. ఎవరు చేశారు?
X
ఒక సినిమాకు సెన్సార్ అయింది. అక్కడ కొన్ని న్యూడ్ సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కత్తెర వేసేయమన్నారు. అవి సినిమా నుంచి లేచిపోయాయి. ఇప్పుడు చెత్తబుట్టలో ఉండాల్సిన ఆ సీన్లన్నీ ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. అవి వైరల్ అయిపోతున్నాయి. మరి ఈ సన్నివేశాలు ఇంటర్నెట్లోకి ఎలా వచ్చాయన్నది అర్థం కావడం లేదు. అసలు మొన్నటిదాకా వార్తల్లోనే లేని ఆ సినిమా గురించి ఇప్పుడు అందరూ చర్చించుకోవడం.. సినిమాకు కొంత మేర హైప్ రావడం చూస్తే ఇదేదో నిర్మాతలు కావాలని చేసిన వ్యవహారం లాగే కనిపిస్తోంది. ఇదీ బాలీవుడ్ మూవీ ‘అనార్కలి ఆఫ్ ఆరా’ చుట్టూ నెలకొన్న వివాదం.

ధనుష్ బాలీవుడ్ మూవీ ‘రాన్ జానా’ చూసిన వాళ్లకు అందులో అతడిని ప్రేమించే అమ్మాయిగా కనిపించిన స్వర భాస్కర్ గుర్తుండే ఉంటుంది. ‘తను వెడ్స్ మను’ లాంటి సినిమాల్లోనూ మెరిసిన స్వర భాస్కర్ ప్రధాన పాత్రలో తెరకెకకిన చిత్రమే ‘అనార్కలి ఆఫ్ ఆరా’. ఐతే ఆమె ఏమీ అంత పేరున్న హీరోయిన్ కాదు. దీంతో ఈ సినిమాకు అనుకున్నంతగా హైప్ రాలేదు. దీంతో సెన్సార్ వాళ్లు నో చెప్పిన న్యూడ్ సీన్స్ అన్నింటినీ కలిపి నిర్మాతలే ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్లో లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అందులో స్వర భాస్కర్ ను కొందరు టీజ్ చేసే సీన్స్ ఉన్నాయి. అలాగే ఆమె బ్యాక్ లెస్ గా కనిపిస్తోంది ఇంకో సీన్లో. ఈ లీక్ వ్యవహారం మీద నిర్మాతలు మండి పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. ఐతే ఈ వీడియో పుణ్యమా అని సినిమాకు ఉన్నట్లుండి హైప్ రావడంతో లోలోన నిర్మాతలు చాలా సంతోషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/