Begin typing your search above and press return to search.

ఎంత క్లీవేజ్ అయితే.. మంచి క్లీవేజ్ అనాలో

By:  Tupaki Desk   |   8 March 2017 7:42 AM GMT
ఎంత క్లీవేజ్ అయితే.. మంచి క్లీవేజ్ అనాలో
X
మహిళల డ్రెసింగ్ పై ఎప్పటికప్పుడు కొత్త కామెంట్స్ వస్తుంటాయి. జరుగుతున్న దారుణాలకు వారి డ్రెసింగ్ నే కారణంగా చూపే వాళ్లు కూడా ఉన్నారు. ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా.. ఇలా మాట్లాడేవారికి సూటిగా తగిలేలా ఓ వీడియో ద్వారా క్లీవేజ్ ను ప్రదర్శించడంపై ఓపెన్ గా మాట్లాడేశారు.. స్వర భాస్కర్.. తాప్సీ.

'అసలు ఎంత క్లీవేజ్ ను ప్రదర్శించడం అయితే.. గుడ్ క్లీవేజ్ అవుతుంది' అనే టాపిక్ పై ఇద్దరూ సీరియస్ గానే కౌంటర్స్ వేసేశారు. 'ఆఫీస్ లో అయితే.. హై నెక్ ఉండాలి.. ఎవరూ డిస్టర్బ్ కాకుండా ఉండాలి కదా. అందుకే టర్టిల్ నెక్ టైపులో.. పీకల వరకూ కవర్ చేసేస్తే బెటర్. ఇక జిమ్ సెంటర్ లో అయితే.. సఫారీ నెక్ వేసుకోవాలి. మెడ నుంచి 6 అంగుళాల వరకే బయటకు ఉండాలన్న రూల్ మర్చిపోకూడదు. జనాల మధ్యలో సాయంత్రం తిరిగేటపుడు మన సేఫ్టీ మనమే చూసుకోవాలి కదా. అందుకే పోలో నెక్ వేసుకోవాలి. పాపం మనం ఏం చూపించకపోతే.. వారికేం ఐడియాలు రావు కదా. ఇక క్లబ్ కి వెళ్లేటపుడు అయితే.. అమ్మదో.. నానమ్మదో షాల్ ను వేసుకెళ్లాలి. ఇక పెళ్లి రోజు అయితే.. అందరూ మనల్నే చూస్తారు కదా. అందుకే మొత్తం కప్పేసుకోవాలి' అని చెప్పారు తాప్సీ.. స్వర భాస్కర్.

ఆ తర్వాత అసలు విషయం చెప్పుకొచ్చారు వీరిద్దరూ. 'నీకుంటే.. దాన్ని చూపించాలని అనుకుంటే చూపించెయ్. దేవుడు ఆలోచించే తయారు చేసుంటాడు కదా. పక్కనోళ్లు ఏదో అనుకుంటే.. అది దేవుడి ప్రాబ్లెం అంతే.. నాది కాదు. చిన్నా పెద్దా ఏది నచ్చితే అది వేసుకో. నేను ఎలా ఉన్నా.. నేను ఏది కలిగి ఉన్నానో.. వాటికి నేను గర్వపడుతున్నా..మరి మీరు?' అని చెప్పిన వీరిద్దరూ "బీయింగ్ ఓ ఉమన్ ఫెంటాస్టిక్" అనే టైటిల్ పై రూపొందిన వీడియో చివరలో 'ఐయాప్ ప్రొడాఫ్ వాట్ వుయ్ ఆర్.. వాట్ వుయ్ యావ్' అంటూ గట్టి మెసేజ్ నే ఇచ్చారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/