Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ శక్తి.. మేమందరం ఫూల్స్ కాదు

By:  Tupaki Desk   |   26 Nov 2016 5:27 AM GMT
ఎన్టీఆర్ శక్తి.. మేమందరం ఫూల్స్ కాదు
X
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో అరివీర భయంకరమైన ఫ్లాపు సినిమాల లిస్టు ఒకటి వేస్తే.. అందులో మొట్టమొదట వినిపించే పేరు ''శక్తి''. మెహర్ రమేష్‌ డైరక్షన్లో రూపొందిన ఈ కళాఖండంలో అసలు ఎన్టీఆర్ ఎందుకు రకరకాల ప్రయోగాలో చేశాడో ఎవ్వరికీ అర్ధంకాదు. ఇకపోతే ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించిన వైజయంతి మూవీస్ అశ్వినీదత్ గారు మాత్రం.. ఆ దెబ్బకి కోల్కోవడానికి పదేళ్ళు పట్టేసింది. అయితే ఇంతకీ ఈ శక్తి గురించి అసలు నిర్మాత ఏమంటున్నారో తెలుసా?

అశ్వినీదత్ కామెంట్లు ఏంటో తెలియవు కాని.. ఆయన కూతురు స్వప్న దత్ మాత్రం.. ఈ సినిమా విషయంలో తామేం తప్పు చేయలేదు అంటున్నారు. ''సినిమా తీసేటప్పుడు రిజల్ట్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. శక్తి సినిమా కథ వింటున్నప్పుడు చాలా అద్భుతంగా కొత్తగా అనిపించింది. కథ బాగోకపోతే సినిమా చేయడానికి మేమందరం ఫూల్స్ కాదు. తారక్ అస్సలు కాదు. కాని సినిమా తీశాక అసలు మనం అనుకున్న కథ వెండితెర మీదకు ఎలా ట్రాన్షర్ అయ్యింది అనే విషయంపై రిజల్టు ఆధారపడి ఉంటుంది. శక్తి విషయంలో కూడా అక్కడే దెబ్బతినేసింది'' అని చెప్పుకొచ్చింది స్వప్న దత్.

చాన్నాళ్ల పాటు స్వప్న కూడా మంచి కథలనే నమ్ముకుంటున్నాం అంటూ కొన్ని ఫ్లాపు సినిమాలే తీసిందిలే. టవిల్లో తను ప్రొడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్ చాలా హిట్టయినప్పటికీ.. సినిమాల్లో మాత్రం ''ఎవడే సుబ్రమణ్యం'' తప్పించి అన్నీ ఫ్లాపులే. అది సంగతి.