Begin typing your search above and press return to search.

స్వామి సాక్షిగా ఈ సరసాలు చూడండి

By:  Tupaki Desk   |   12 Jan 2018 10:55 PM IST
స్వామి సాక్షిగా ఈ సరసాలు చూడండి
X
గత కొంత కాలంగా మంచి విజయాల కోసం ప్రయత్నాలు చేస్తోన్న హీరోల్లో మంచు విష్ణు కూడా ఉన్నాడు. ఈ మంచు వారి అబ్బాయి చాలా కాలంగా హిట్టు కోసం చేయని ప్రయత్నాలు లేవు. కామెడీ యాక్షన్ రీమేక్ కథలు అంటూ ఎన్ని సినిమాలతో వచ్చినా ఊహించని విధంగా అపజయాలను అందుకున్నాడు. అప్పుడెప్పుడో డీ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విష్ణు మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

కానీ ఈ సారి ఎలాగైనా తన కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రేంజ్ లో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఆచారి అమెరికా యాత్ర అనే కామెడీ సినిమాను జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అయితే ఇప్పటి నుంచే జనాలను ఆకర్షించేందుకు సినిమాకు సంబందించిన ఎదో ఒక స్పెషల్ ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల టీజర్ ను రిలీజ్ చేసిన విష్ణు ఈ రోజు సినిమాలోని ఒక దెవొషనల్ తో కూడిన లవ్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశాడు.

స్వామి రా రా అనే ఆ పాటలో ఓ వైపు స్వామిని పొగుడుతూనే ప్రగ్యా జైస్వాల్ తో సరసాన్ని కొనసాగించాడు మంచు హీరో. థమన్ అందించిన మ్యూజిక్ బాగానే ఉందిలే. హీరోయిన్ ప్రగ్యా పాటలో చాలా అందంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు హాట్ డ్రెస్సులో కనిపించిన ఈ బ్యూటీ సడన్ గా ట్రెడిషినల్ లుక్ ఇచ్చేసరికి ఎంత బావుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కామెడీ కథలతో హిట్టు కొట్టే జీ.నాగేశ్వర్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా. కిట్టు - కీర్తి చౌదరి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.