Begin typing your search above and press return to search.
'కళావతి' ప్రోమో: మహేష్ కోసం సిద్ శ్రీరామ్ పాడిన సర్కారు వారి పాట..!
By: Tupaki Desk | 11 Feb 2022 5:43 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''సర్కారు వారి పాట''. ఇందులో మహేష్ సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలవుతున్నాయి.
'సర్కారు వారి పాట' సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - స్పెషల్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'కళావతి' అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా తాజాగా 36 సెకన్ల ప్రోమో సాంగ్ ని చిత్ర బృందం సోషల్ మీడియాలో వదిలింది.
'మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా.. కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరద శ్శతం' అనే పెళ్లి ప్రమాణంతో ప్రారంభమైన ఈ క్లాసికల్ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఈ గీతానికి మంచి సాహిత్యం రాశారు.
'వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయ.. ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా మొగినాయా.. ఓ ఇందు సోయా' అంటూ సిద్ మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేసాడని చెప్పొచ్చు. మహేష్ బాబు సినిమాలో పాటకు యువ గాయకుడు మొదటిసారి తన గాత్రాన్ని అందించడం విశేషం. ఈ పాట వాలెంటైన్స్ డేని మరింత స్పెషల్ గా మార్చనుంది.
ఇందులో మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ జంట చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరి మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని ఈ పాటలో చూడొచ్చు. మహేష్ ట్రెండీ కాస్టుమ్స్ లో మునుపటికంటే ఇంకా యంగ్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మొత్తం మీద మరో మూడు రోజుల్లో రాబోయే 'కళావతి' ఫుల్ లిరికల్ సాంగ్ పై ఈ ప్రోమో అంచనాలు పెంచేసింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేష్ సినిమా నుంచి వచ్చిన పాట కావడంతో ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్. మది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12వ తేదీన 'సర్కారు వారి పాట' సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.