Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్‌' కు ఎస్వీఆర్‌ సెట్‌ అయ్యాడు

By:  Tupaki Desk   |   20 Nov 2018 5:33 AM GMT
ఎన్టీఆర్‌ కు ఎస్వీఆర్‌ సెట్‌ అయ్యాడు
X
'ఎన్టీఆర్‌’ బయోపిక్‌ లో ప్రముఖుల పాత్రకు గాను ప్రముఖ నటీనటులను తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఏయన్నార్‌ పాత్ర కోసం ఆయన మనవడు సుమంత్‌ - చంద్రబాబు నాయుడు పాత్రకు రానా - శ్రీదేవి పాత్రకు రకుల్‌ - జయప్రద పాత్రకు తమన్నా - సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ ఇలా పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించబోతున్నారు. ‘ఎన్టీఆర్‌’ సినిమాలో మోహన్‌ బాబుకు ఖచ్చితంగా స్థానం ఉంటుందని, ఆయన ఈ చిత్రంలో ఎస్వీఆర్‌ పాత్రను పోషించే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. ఆయనతో చిత్ర యూనిట్‌ సభ్యులు సంప్రదింపులు కూడా జరిపారంటూ వార్తలు వచ్చాయి.

‘మహానటి’ చిత్రంలో ఎస్వీఆర్‌ పాత్రను చక్కగా పోషించిన మోహన్‌ బాబు ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో కూడా ఎస్వీఆర్‌ పాత్రను పోషిస్తాడనుకున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్‌ సభ్యులు షాక్‌ ఇచ్చారు. ఎస్వీఆర్‌ పాత్ర కోసం కొత్త ఆర్టిస్టును ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది నటులను పరిశీలించి - ఆడిషన్స్‌ చేసిన తర్వాత ఎస్వీఆర్‌ ను పోలి ఉన్న ఒక థియేటర్‌ ఆర్టిస్టును క్రిష్‌ ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఎస్వీఆర్‌ పాత్రకు కొత్త నటుడు ఎంపిక అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అనధికారికంగా చెబుతున్నారు. ఎస్వీఆర్‌ పాత్ర తరహాలోనే కాంతారావు పాత్రకు కూడా కొత్త నటుడిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్స్‌ తో పాటు - పలువురు కొత్త వారు కూడా కనిపించబోతున్నారు. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రంలో ఈస్టార్స్‌ అంతా కూడా కనిపించబోతున్నారు. ‘ఎన్టీఆర్‌’ మహానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో తారస పడ్డ నాయకులను చూపించబోతున్నారు. ఆ నాయకుల పాత్రలను కొత్త వారితో చేయిస్తున్నాడు క్రిష్‌.

జనవరిలో ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌ లు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ మరికొన్ని రోజుల్లోనే పూర్తి అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.