Begin typing your search above and press return to search.

ఒక ఆడపిల్ల ఇంతగా కష్టపడటం నేను చూడలేదు

By:  Tupaki Desk   |   9 Dec 2021 4:34 AM GMT
ఒక ఆడపిల్ల ఇంతగా కష్టపడటం నేను చూడలేదు
X
ఒక మూడు జీవితాలు ఎక్కడ మొదలయ్యాయి .. ఎలా తమ ప్రయాణాన్ని కొనసాగించాయి .. ఎలాంటి అవాంతరాలను ఎదుర్కొన్నాయి .. చివరికి ఏ గమ్యానికి చేరుకున్నాయి? అనే కథాంశంతో రూపొందిన సినిమానే 'గమనం'.

సుజనారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శ్రియ ప్రధానమైన పాత్రను పోషించింది. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఈ సినిమాకి గౌరవ అతిథిలుగా ఎస్వీ కృష్ణారెడ్డి - అచ్చిరెడ్డి హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ .. "ఈ నెల 10వ తేదీన మనం ఒక మంచి సినిమాను చూడబోతున్నాము. సుజనారావు కృషి .. దీక్ష ... పట్టుదలనే ఈ సినిమా. ఈ రోజున ఈ సినిమాను మన ముందుకు తీసుకురావడానికి ఆమె ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు.

ఎక్కడా కూడా ఆమె కాంప్రమైజ్ కాలేదు .. సినిమా క్వాలిటీ విషయంలో గానీ, లేదా క్వాలిటీ ఇచ్చే వ్యక్తుల విషయంలో గాని. ఒక పక్క నుంచి ఇళయరాజా గారిని పెట్టుకున్నారు. ఆయన మ్యూజిక్ మ్యాస్ట్రో. అలాంటి ఆయన అవసరం ఈ సినిమాకి ఉందని భావించే ఆమె ఆయనను తెచ్చుకోవడం జరిగింది.

ఇప్పటివరకూ ఆ పాటలను విన్నాము .. అద్భుతంగా ఉన్నాయి. ఎంతో చక్కని మ్యూజిక్ ను ఆయన అందించారు. ముఖ్యమైన పాత్రలో శ్రియను ఎంపిక చేసుకోవడం .. కావాలని ఆమెను కోరి తెచ్చుకోవడం కథ మీద ఆమెకి ఎంత పట్టు ఉందనే విషయాన్ని చెబుతున్నాయి. ఆ పట్టు ఉండటం వల్లనే పెర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేసే వ్యక్తులను ఏరి కోరి తెచ్చుకోవడం ఆమె గొప్పతనం. అది మనం ఒప్పుకు తీరవలసిన విషయమే. ఇక్కడితో ఆమె ఆగలేదు. మంచి రైటర్ కావాలంటే, బుర్రా సాయిమాధవ్ గారిని తెచ్చుకున్నారు.

ఇక ముఖ్యంగా శివ కందుకూరి గురించి చెప్పాలి .. ఆయన పెర్ఫార్మెన్స్ ఇప్పుడే చూశాను. అతను .. హీరోయిన్ కూడా చాలా చక్కగా చేశారు. అలాంటి వాళ్లందరితో తనకి కావలసిన అవుట్ పుట్ రాబట్టిన తీరు చూస్తుంటే, ఈ సినిమా హండ్రెడ్ పెర్సెంట్ హిట్ అవుతుందనే విషయం అర్థమైపోతోంది.

ఈ సినిమా విడుదలైన తరువాత మొదటిసారిగా వినే మాటే సక్సెస్. ఒక మంచి సినిమాను మనకు ఇవ్వడానికి ఆమె ఎంతో కష్టపడింది .. శ్రమపడింది. ఒక ఆడపిల్ల ఇన్ని రకాలుగా కష్టపడటం నిజంగా గొప్ప విషయం. అంతగా ఆమె ప్రేమించిన ఆ సినిమా బాగుండకుండా ఎందుకుంటుంది? బాగుండే తీరుతుంది" అని చెప్పుకొచ్చారు