Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: శబ్దంతో వినాశనం
By: Tupaki Desk | 6 Feb 2019 10:10 AM ISTఈ మధ్య కాలంలో ఫాంటసీ సినిమాలు తగ్గిన తరుణంలో వస్తున్న కొత్త మూవీ సువర్ణ సుందరి. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఏవో కారణాల వల్ల విడుదల వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేసింది టీం. కథను పూర్తిగా రివీల్ చేయకపోయినా ఇందులో చూపించిన విజువల్స్ ని బట్టి ఇదో థ్రిల్లర్ ఫాంటసీ అని అర్థమైపోతోంది.
పురాతన గనుల్లో దొరికిన ఓ విగ్రహానికి అశేషమైన శక్తులు ఉంటాయి. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు ప్రతిదీ స్పష్టంగా వినిపిస్తుంది. అయితే పక్కన ఉన్న వాళ్ళను హత్య చేసేందుకు ఉసిగోలుపుతుంది. కాని దాని వెనుక ఎప్పుడో శతాబ్దాల నాటి పాత చరిత్ర ఉంటుంది. అదే సువర్ణ సుందరి కథ. అసలు ఆమె ఎవరు ఆ విగ్రహ రూపంలోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు హత్యలకు ఎందుకు తెగబడుతోంది లాంటి ప్రశ్నలకు ట్రైలర్ లో సమాధానం దొరకడం కష్టం.
జయప్రద లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఇందులో ఉండటం వల్ల నిండుతనం వచ్చింది. పూర్ణ-సాక్షి చౌదరిలు టైటిల్ కు సంబంధమున్న కీలక పాత్రల్లో నటిస్తుండగా హత్యలను చేధించే పోలీస్ ఆఫీసర్ గా సాయి కుమార్ కనిపిస్తున్నాడు. కోట శ్రీనివాస రావు-ముక్తార్ ఖాన్-అవినాష్ ఇతర కీలక పాత్రలు చేసారు. ప్లాట్ కొంత ఆసక్తికరంగానే అనిపిస్తోంది. గ్రాఫిక్స్ గురించి ఎక్కువ కామెంట్ చేయడానికి ట్రైలర్ లో ఛాన్స్ ఇవ్వలేదు. ఏంఎస్ఎన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఫాంటసీ నేపధ్యాన్ని బాగా ఇష్టపడే వాళ్ళకు కనెక్ట్ అయ్యేలా ఉన్న సువర్ణ సుందరి ఒకప్పటి ఏఎన్ఆర్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్. మరి ఇప్పుడీ ట్రైలర్ తో రేపిన అంచనాలు ఎంతమేరకు నిలబెట్టుకుంటారో విడుదల దాకా వేచి చూడాలి.