Begin typing your search above and press return to search.

మాజీ వైఫ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ

By:  Tupaki Desk   |   27 April 2016 5:40 PM GMT
మాజీ వైఫ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ
X
ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్. తనను ఆ స్టార్ హీరో మోసం చేశాడనే హీరోయిన్. అసలామెతో సంబంధం లేదనే స్టార్. ఇదీ బాలీవుడ్ లో కొన్ని వారాలుగా కంటిన్యూ అవుతున్న బ్రేకప్ బాగోతం. ఇప్పటికే ఇదంతా హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల గురించే అని అర్ధమైపోయింది కదా. ఇప్పుడీ వ్యవహారంలోకి సడెన్ గా హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్ ఎంటర్ అయింది.

సుసానే ఎంట్రీ కూడా మామూలుగా లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రేంజ్ లో వచ్చేసి, సడెన్ గా సర్ ప్రైజ్ చేసేసింది. హృతిక్ తో విడిపోయిన తర్వాత డైవోర్స్ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని సుసానే.. ఇప్పుడు సడెన్ గా మాజీ హజ్బెండ్ ని వెనకేసుకొచ్చేసింది. 'ఆ ఫొటోలన్నీ ఫోటోషాప్ బాపతువే. అబద్ధాలకు తెగ ప్రచారం లభిస్తుంది. మీకోసం ఇదో ఫోటో. ఈ విషయంలో నేను హృతిక్ నే సపోర్ట్ చేస్తున్నా' అంటూ తన ఎంట్రీతోనే కంగనాకు కౌంటర్ ఇచ్చింది ఈ మాజీ వైఫ్.

ఇప్పటికే కంగనా టీం లీక్ చేసిన ఫోటోలపై చాలానే అనుమానాలున్నాయి. ఇది ఫేక్ ఫొటో అని చాలామంది అంటున్న సమయంలో.. సుసానే ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. సుసానే ఎంట్రీలోనే ఇచ్చిన దెబ్బకి.. కంగనా ఫుల్ డిఫెన్స్ లో పడిపోయిందనే అనుకోవాలి. అసలు వీళ్లిద్దరి విడాకులకి కూడా కారణం కంగనానే అనుకుంటున్న టైంలో.. ఇంత హఠాత్తుగా మాజీ మొగుడిపై సుసానే ఖాన్ ఇంత ప్రేమ పుట్టడానికి కారణం ఏంటో మాత్రం అర్ధం కావడం లేదు.