Begin typing your search above and press return to search.

మాజీ భార్య ప్రియుడికి హృతిక్ శుభాకాంక్ష‌లు

By:  Tupaki Desk   |   20 Dec 2022 2:30 AM GMT
మాజీ భార్య ప్రియుడికి హృతిక్ శుభాకాంక్ష‌లు
X
స్టార్ల‌ బ్రేక‌ప్ లు ఓవైపు క‌ల‌చి వేస్తుంటే మ‌రోవైపు కొత్త పార్ట‌న‌ర్ల‌తో ఎవ‌రి దారి వారు చూసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ముచ్చ‌టైన జంట‌లు విడిపోతుంటే త‌ట్టుకోలేని అభిమానులు ఈ ప‌ర్య‌వ‌సానాన్ని అర్థం చేసుకునేందుకు పెద్ద మ‌న‌సుతో ధీవించేందుకు త‌మ‌ను తాము ప్రిపేర్ చేసుకుంటున్నారు!

బాలీవుడ్ లో ముచ్చ‌టైన జంట హృతిక్- సుసానే ఖాన్ విడిపోయి చాలా కాల‌మే అయ్యింది. ఇటీవ‌ల హృతిక్ రోష‌న్ స‌హ‌న‌టి సబా ఆజాద్ తో ప్రేమాయ‌ణం సాగించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. అటుపై హృతిక్ తల్లిదండ్రులు కూడా కుమారుని బాంధ‌వ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వరలో హృతిక్ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ జంట షికార్లు నిరంత‌రం హాట్ టాపిక్ గా మారాయి. అలాగే ముంబైలో స‌బా కోసం హృతిక్ ఒక అపార్ట్ మెంట్ కొన్నాడ‌ని అందులోనే పెళ్లి త‌ర్వాత‌ కాపురం పెట్టేస్తున్నార‌ని కూడా టాక్ వినిపించింది.

అలాగే సుస్సేన్ ఖాన్ - అర్స్లాన్ గోని జంట షికార్ల గురించి తెలిసిన‌దే. ఈ జంట కూడా త‌మ బంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల విమానాశ్ర‌యంలో ఒక‌రికొక‌రు చేతిలో చెయ్యేసి న‌డుస్తూ క‌నిపించడం సంచ‌ల‌న‌మైంది. నటుడు అర్స్లాన్ గోనీతో సుస్సానే డేటింగ్ చేస్తున్నట్లు తొలుత‌ ఊహాగానాలు వ‌చ్చాయి. కానీ ఆ పుకార్లు నిజ‌మ‌య్యాయి.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే..!

హృతిక్ సాబాతో ప్రేమ‌లో ఉండ‌గా... అర్ల్సాన్ గోనీతో సుశానే డేటింగ్ చేస్తోంది. ఇటీవ‌ల సౌదీ అరేబియా- జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో హృతిక్ రోషన్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అత‌డు తాజాగా తన మాజీ భార్య సుస్సానే ఖాన్ పోస్ట్ పై స్వీట్ మెసేజ్ ని పంపారు. ఈ రోజు సుస్సాన్ ప్రియుడు అర్స్లాన్ గోని పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అతడికి స్పెష‌ల్ గా బ‌ర్త్ డే విషెస్ ని తెలియ‌జేసాడు హృతిక్.

హృతిక్ మాత్రమే ఇలా శుభాకాంక్ష‌లు చెప్పాడ‌నుకుంటే ఈ క‌థ అంత‌టితో అయిపోలేదు. గ్రీక్ గాడ్ స్నేహితురాలు సబా ఆజాద్ కూడా అర్స్లాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సుస్సాన్ ఇన్ స్టా ఫీడ్ లోని అర్స్లాన్ కి చెందిన‌ అనేక ఫోటోలను కలిగి ఉన్న వీడియోను స‌బా షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రేమ పక్షులకు సంబంధించిన రొమాంటిక్ ఫోటోలు చాలా ఉన్నాయి. గోనీతో సుశానే రొమాన్స్ పీక్స్ లో పండింద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. ఈ ఫోటోల‌ను షేర్ చేయ‌డ‌మే గాక‌.. సుస్సానే అందమైన పుట్టినరోజు నోట్ ను రాసింది. ``అత్య‌ద్భుతమైన హృదయం క‌లిగినవాడు`` అని వ్యాఖ్య‌ను జోడించింది. ప్రేమకు తన నిర్వచనం అతడే అని కూడా రాసింది. తాజా పోస్ట్ లో సుశానే ఇలా విషెస్ తెలిపారు. హ్యాపీయెస్ట్ హ్యాపీయెస్ట్ బర్త్‌డే .. మై లవ్... నాకు తెలిసిన అత్యంత అపురూపమైన మనిషివి నువ్వు.. నువ్వు నన్ను మంచి వ్యక్తిగా ఉండేలా చేశావు.. నేను చేసే ప్రతి పనిలో.. ప్రేమకు నీవే నా నిర్వచనం.. కాలం మ‌స‌క‌బారింది.. అంతకు మించి... మేం ఈ సుఖ‌వంత‌మైన‌ జీవితాన్ని ఆస్వాధిస్తున్నాం.. అని తెలిపింది.

సుసానే పోస్ట్ ను షేర్ చేసిన వెంటనే హృతిక్ బ‌ర్త్ డే బోయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు @arslangoni అని హృతిక్ వ్యాఖ్య‌ను జోడించారు. అతని లేడీ లవ్ సబా కూడా ``పుట్టినరోజు శుభాకాంక్షలు`` అని వ్యాఖ్యానించారు. సంజయ్ కపూర్- మహీప్ కపూర్- నీలం కొఠారి- సోనాల్ చౌహాన్- సోనాలి బింద్రే వంటి ఇతర ప్రముఖులు అర్స్లాన్ కు స్వీటెస్ట్ మెసేజ్ లతో శుభాకాంక్షలు తెలిపారు. ధన్యవాదాలు నా ప్రియమైన ప్రేమికుల‌కు అంటూ బ‌ర్త్ డే బోయ్ ఆనందం వ్య‌క్తం చేసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. `ఫైటర్` తాజా షెడ్యూల్ ని పూర్తి చేసిన హృతిక్ ఇటీవల అస్సాం నుండి తిరిగి వచ్చాడు. దీపికా పదుకొణె- అనిల్ కపూర్- కరణ్ సింగ్ గ్రోవర్ ఈ చిత్రంలో ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.