Begin typing your search above and press return to search.

అసలు రాత్రి క్లబ్ లో ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరో భార్య!!

By:  Tupaki Desk   |   23 Dec 2020 1:07 PM IST
అసలు రాత్రి క్లబ్ లో ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరో భార్య!!
X
ముంబై విమానాశ్రయానికి దగ్గరలోని డ్రాగన్ ఫ్లై క్లబ్ లో కోవిడ్ నియమాలను పాటించనందుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసారని వచ్చిన వార్తలను ఆమె నిజం కాదని కొట్టిపారేసింది. అసలు డ్రాగన్ ఫ్లై క్లబ్ దగ్గర ఏం జరిగింది? అనే విషయాలు పూర్తిగా బయటపెట్టింది. 'గత రాత్రి నేను ఫ్రెండ్ పుట్టినరోజు విందులో ఉన్నాను. తెల్లవారుజామున 2:30 గంటలకు అధికారులు క్లబ్‌లోకి ప్రవేశించారు. క్లబ్ మేనేజ్‌మెంట్, అధికారులు విషయాలను అడిగి తెలుసుకుంటున్న టైంలో, అక్కడ హాజరైన అతిథులందరూ మూడు గంటల పాటు కస్టడీలో ఉండాలని కోరారు. అలా మూడు గంటల అనంతరం అంటే.. ఉదయం 6 గంటలకు మేం బయటికి రావడానికి అనుమతి ఇచ్చారు. అంతేగాని, అరెస్టులు జరిగాయని మీడియాలో లేనిపోని అపోహలు సృష్టించడం తప్పు అని, ఈ విషయంలో మీడియా వారు బాధ్యత రహితంగా ప్రవర్తించారని' సుసన్ ఖాన్ తెలిపింది.

అసలు మమ్మల్ని డ్రాగన్ క్లబ్ లో ఎందుకు వెయిట్ చేయించారో.. అసలు అధికారులతో, క్లబ్‌తో సమస్య ఏమిటో అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని ఆమె ప్రకటించింది. అంతేగాక ఈ స్టేట్‌మెంట్‌తో తను క్లారిఫై చేసినట్లు చెప్పింది. ఇక ముంబై పోలీసుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, మమ్మల్ని రక్షణ కోసం ముంబై పోలీసులు చేసిన నిస్వార్ధ సేవలను ఆమె కొనియాడింది. ఈ విధంగా సుసన్ ఖాన్ అసలు డ్రాగన్ ఫ్లై క్లబ్ లో ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. అలాగే క్రికెటర్ సురేష్ రైనా, సింగర్ గురు రంధర్వలు కూడా ఆ క్లబ్ లో ప్రోటోకాల్ ఫాలో కాకుండా దొరికినప్పటికి.. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని తెలిపి బెయిల్ పై బయటికి వెళ్లినట్లు సమాచారం.