Begin typing your search above and press return to search.
పవన్-త్రివిక్రమ్.. నిర్మాత ఎవరయ్యా?
By: Tupaki Desk | 26 Jun 2016 5:00 PM ISTఅ..ఆ.. సక్సెస్ జోష్ లో ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన తర్వాతి సినిమాను స్నేహితుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో 'కడపకింగ్' (అనుకుంటున్నారంతే) చేస్తున్న పవన్.. నవంబర్ తో దీన్ని ముగించేసి త్రివిక్రమ్ తో జత కానున్నాడు. మరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు?
త్రివిక్రమ్ తో నిర్మాత ఎస్. రాధాకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మరుసటి సినిమా కూడా తమ బ్యానర్ లోనే ఉంటుందని ఇప్పటికే రాధాకృష్ణ చెప్పారు కూడా. అలాగే త్రివిక్రమ్ ను స్క్రిప్ట్ సిద్ధం చేయమని పవన్ సూచించాడు కూడా. దీంతో పవన్ సినిమాకి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ అనే అందరూ అనుకుంటున్నారు. అయితే.. త్రివిక్రమ్ ఈ విషయాన్ని మాత్రం కన్ఫాం చేయకపోవడానికి కారణం పవన్ అని తెలుస్తోంది.
నిర్మాతగా పవన్ మదిలో వేరే వ్యక్తి ఉన్నాడు. ఆయన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు. త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రాన్ని దాసరి చేతిలో పెట్టాలని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తాను ఫైనల్ చేసేవరకూ నిర్మాత పేరు అనౌన్స్ చేయద్దని త్రివిక్రమ్ కు చెప్పాడట పవన్ కళ్యాణ్. అలా నా మరుసటి చిత్రం రాధాకృష్ణకే చేస్తానని చెప్పడంలో.. త్రివిక్రమ్ వెనకడుగు వేయాల్సి వచ్చిందన్న మాట.