Begin typing your search above and press return to search.

ఆమె ముందు వెండి, బంగారాలు వలవలా..

By:  Tupaki Desk   |   25 Dec 2015 5:00 PM IST
ఆమె ముందు వెండి, బంగారాలు వలవలా..
X
పై ఫోటో చూసి.. సుస్మితా సేన్ కి 40 ఏళ్ల వయసు ఉందంటే నమ్మగలరా ? ఈమె మిస్ యూనివర్స్ గా ఎంపికై 21 సంవత్సరాల గడిచిందంటే యాక్సెప్ట్ చేయగలమా ? కానీ ఇది నిజమే. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కి ప్రజలు, అభిమానులను ఎలా అలరించాలో పక్కాగా తెలుసు. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో.. ఈ భామ ఎప్పుడూ తన చాకచక్యం ప్రదర్శిస్తూనే ఉంది.

రీసెంట్ గా తాను తీయించుకున్న ఓ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది సుస్మితా సేన్. సుబి శామ్యూల్ అనే ఫోటోగ్రాఫర్ కం సుశ్మిత ఫ్రెండ్ ఈ పిక్చర్ ని తీశాడు. గతంలో ఎప్పుడూ కనిపించనంత హాట్ గా ఈ ముదురు భామను కెమేరాలో బంధించడం విశేషం. సిల్వర్ షార్ట్ - సిల్వర్ హైహీల్స్ తో మెరిసిపోతోంది. కొండపై నుంచి కిందకు కనపడే బ్యాక్ గ్రౌండ్ - ఫోటో అంతా గోల్డ్ కలర్ యాంబియన్స్.. సోఫాపై వయ్యారంగా పడుకుని.. కాళ్లు పైకి పెట్టిన సుస్మితాసేన్. ఫోటో అదుర్స్ అనిపిస్తోంది కదూ. అయితే.. ఫోటో ఎంత సూపర్బ్ గా ఉన్నా.. అందులో సుస్మిత గ్లామరే హైలైట్. బంగారు వర్ణంలో కనిపిస్తున్న పిక్చర్, వెండి మెరుపులతో మెరుస్తున్న డ్రెస్ కూడా.. సుస్మిత ముందు వెలవెలబోయి వలవలా ఏడుస్తున్నాయి కదూ.

ఇంత పర్ఫెక్ట్ తన అందాన్ని ప్రదర్శించగలదు కాబట్టే.. ఈమె ఎప్పుడూ హాట్ మోడల్ అనిపించుకుటుంది. పైకి కనిపించే అందంతో.. ఈమె మనసు కూడా బంగారమే. సామాజిక సేవల్లో విరివిగా పాల్గొనే సుస్మితా సేన్.. కొంతమందిని దత్తత తీసుకుని పెంచుతుండడం విశేషం. ఇప్పుడీమెకు రీనీ, అలీషా అనే ఇద్దురు కూతుళ్లు ఉన్నారు.