Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లేటు వయసులో ఘాటుగా..

By:  Tupaki Desk   |   7 May 2017 4:17 AM GMT
ఫోటో స్టోరి: లేటు వయసులో ఘాటుగా..
X
ఇప్పుడు బాలీవుడ్ లో అంతగా సినిమాలు చేయకపోయినా అప్పుడుప్పుడు రియాలిటీ షో రాంప్ వాక్ లో మెరుస్తూ ఉంటుంది ఈ విశ్వ సుందరి సుస్మితా సేన్. పెళ్లి వయసు దాటి చాలా కాలం అయనప్పటికీ పదహారేళ్ళ పడుచులా కనిపిస్తుంది ఈ సుందరి. పెళ్లి చేసుకోకుండా పిల్లలిని దత్తత తీసుకొని ఫ్యాషన్ వాక్స్.. ఇతర షోస్ తో బాగానే తన అందాన్ని స్టైల్ ని విరివిగా వాడేస్తుంది.

ఇక్కడ ఫోటో చూస్తే ఇంకా హీరోయిన్ గా చేసే అన్నీ అనువైన అందాలు తనలో ఉన్నాయి అని చెప్పకనే చెప్పింది సుస్మిత. ట్యాంక్ టాప్ పొట్టి గౌను లో ఏదో రాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తునట్లు ఉంది. 41 ఏళ్ల వయసులో కూడా తెలుగు సామెత గుర్తుకు వచ్చేలా ఉంది సుష్మిత. ''అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు'' అన్నారు పెద్దలు. ఇకపోతే అమ్మడు లవ్ లైఫ్‌ గురించి ఎలాంటి పుకారులు వచ్చినా కూడా.. ఆ మత్తు నవ్వుతో వాటిని కాదనేస్తోంది.

చాలా సార్లు మీడియా వాళ్ళు పెళ్లి గురించి ప్రస్తావిస్తే “నేను నా నిర్ణయం తో చాలా సుఖంగా ఉన్నాను మిగతవారి నిర్ణయాలు పైన గౌరవం ఉంది. అయన సింగల్ ఏంటి డబుల్ ఏంటి మనం గెలవాలి'' అంటూ ఫిలాసఫీ చెప్పింది. అంతేకాదట.. ''నేను ఇంతవరుకు నాలాంటి నిప్పుతో నడవగలిగే మగాడినే చూడలేదు'' అని కామెంట్ చేసింది. బ్యాచిలర్స్.. మీ లక్ టెస్ట్ చేసుకోండి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/