Begin typing your search above and press return to search.

సాధనే నన్ను సాధారణ స్థితికి మార్చింది: విశ్వసుందరి

By:  Tupaki Desk   |   18 May 2020 2:30 PM GMT
సాధనే నన్ను సాధారణ స్థితికి మార్చింది: విశ్వసుందరి
X
మాజీ విశ్వ సుంద‌రి సుస్మితా సేన్ గతంలో క్యాన్స‌ర్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి పోరాడి క్యాన్స‌ర్‌ను జయించింది. తాజాగా హెల్త్ సీక్రెట్స్‌ని యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ తెలియజేస్తుంది. మ‌న శ‌రీరం గురించి మ‌న‌కంటే ఎక్కువ ఎవ‌రికి తెలియ‌దు. నాంచాక్ ప్రాక్టీస్ వ‌ల‌న సుస్మిత మ‌ళ్లీ మాములు స్థితికి వ‌చ్చిన‌ట్టు చెప్తుంది. కొన్నేళ్లుగా రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా ఎల్లప్పుడూ ఏదొక విశేషంతో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది ఈ విశ్వసుందరి. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లలో ఉండి ఏదొక పని చేసుకుంటుంటే.. సుస్మితసేన్ మాత్రం జిమ్ లో కసరత్తులు చేస్తూ వీడియోలు ఇరగదీస్తుంది. ఇక ఈ అమ్మడు నాంచాక్ పట్టుకొని తిప్పుతుంటే అభిమానులకు కన్నుల పండుగలా భావిస్తున్నారు. కానీ ఆ నాంచక్ విన్యాసం వెనక ఓ కన్నీటి గాథ కూడా ఉందంటుంది ఈ భామ.

‘2014 సెప్టెంబర్‌లో నేను అడిసన్‌ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దానివల్ల నాలో రోగనిరోధకశక్తి పూర్తిగా నశించింది. ఆ వ్యాధితో పోరాటం చేయడానికి కూడా శక్తి లేదని భావించేదాన్ని. శరీరం బాగా నీరసంగా అనిపించేది. ఆ సమయంలో నా కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. నా జీవితంలో అలాంటి చీకటి రోజులతో నాలుగు సంవత్సరాలు ఎలా పోరాటం చేశానో మాటల్లో చెప్పలేను. వ్యాధి నుంచి బయటపడడం కోసం ఉత్ప్రేరకాలను తీసుకున్నాను. వాటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా వచ్చాయి. ఒకానొక టైంలో అనారోగ్యంతోనే జీవించాలమో అనిపించింది. అలాంటి సమయంలో నన్ను నేను రీబిల్డ్‌ చేసుకోవాలనుకున్నాను. నా ఆలోచనలను బలోపేతం చేసుకున్నాను. ఆరోగ్యవంతంగా మారడానికి సరైన మార్గాన్ని ఎంచుకున్నాను. ‘నాంచాక్’ కరెక్ట్ అనిపించి బాగా సాధన చేశాను. త్వరగా కోలుకున్నాను. ఎలాంటి ఉత్ప్రేరకాలు లేకుండా 2019 నాటికి నేను మళ్లీ మామూలు స్థితికి రాగలిగాను" అంటూ సుస్మితా తను పోరాడిన విధానం వివరించింది.