Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స్వీట్ షాకిచ్చింది

By:  Tupaki Desk   |   5 April 2018 9:25 AM GMT
ఫోటో స్టోరి: స్వీట్ షాకిచ్చింది
X
సుస్మితా సేన్ మిస్ యూనివ‌ర్స్ కిరీటం గెలిచి... ఇప్ప‌టికే 24 ఏళ్లు గ‌డిచిపోయాయి. దాదాపు ఆ స‌మ‌యంలోనే పుట్టిన అలియా భ‌ట్‌... ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామ‌ణి అవుతోంది కూడా. ఇన్నేళ్లు గ‌డిచినా... అప్పుడెలాఉందో... ఇప్ప‌టికీ అదే ఫిజిక్ మెయింటెయిన్ చేస్తూ కుర్ర హీరోయిన్ల‌కి పోటీ ఇస్తోందీ ఆంటీ. ఫిట్ నెస్ విష‌యంలో చాలామంది కుర్ర హీరోయిన్ల కంటే సుస్మితానే ముందుంది. తాజాగా త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో సుస్మితా సేన్ పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన వారెవ్వ‌రైనా ఈ మాట ఒప్పుకోని తీరాల్సిందే.

చిన్న బ్రా సైజ్ టాప్ ధ‌రించిన సుస్మితా... అందాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం లేదు... గ‌ర్వంగా చూపించే శ‌రీరం నా సొంతం... అంటూ కామెంట్ కూడా పెట్టింది. స్లిమ్ గా... ఫిట్ గా ఉన్న సుస్మితా సేన్ శ‌రీరాన్ని చూసిన వారెవ్వ‌రైనా... ఔరా! ఆంటీయా... అమ్మాయా? అని ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా. 43 ఏళ్ల వ‌య‌సులోనూ ఈ స్థాయిలో ఫిట్ నెస్ ను పాటిస్తున్న సుస్మితా... త‌న రోజువారీ వ్యాయామాల‌ను వీడియో తీసి పోస్ట్ చేస్తోంది. ఈ ఫోటోల్లో సుస్మితా ఆంటీ అందాలు కూడా ఆర‌బోస్తుండ‌డంతో ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య భారీగానే పెరుగుతోంది. సుస్మితా చేస్తున్న వ్యాయామాలు కూడా మామూలువి కాదు. యంగ్ వ‌య‌సులో ఉన్న‌వారికే అతి క‌ష్ట‌మైన క‌స‌ర‌త్తుల‌ను కూడా య‌మా ఈజీగా చేసేస్తుంది సుస్మితా.

ఈ వ‌య‌సులో కూడా ఫిట్ నెస్ శ‌రీరం కోసం సుస్మితా సేన్ చేస్తున్న వ్యాయమాలు కుర్ర‌కారుకి స్పూర్తినిస్తున్నాయి. ఆంటీ క‌ష్టాన్ని చూసి... బుద్ధి తెచ్చుకుని ఒళ్లు వంచి క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట చాలామంది. ఇలా కామెంట్లు చేస్తున్న వారి ప్రోత్సాహంతో మ‌రిన్ని వీడియోల‌ను పోస్ట్ చేస్తోంది సుస్మితా. మ‌రి ఇంత నాజుకూ అందాన్ని తెర మీద చూపించేందుకు ఏ ద‌ర్శ‌కుడు ముందుకొస్తాడో చూడాలి.