Begin typing your search above and press return to search.

ఒక భామ - పది సార్లు ప్రేమ

By:  Tupaki Desk   |   29 Oct 2015 1:30 AM GMT
ఒక భామ - పది సార్లు ప్రేమ
X
ఆమె మిస్ యూనివర్స్.. ఇప్పుడు కాదు లెండి 1994లో విశ్వసుందరి కిరీటం కైవసం చేసుకుంది సుస్మితా సేన్. సినిమాల్లోనూ మోడలింగ్ లోనూ వెలుగులు విరజిమ్మింది. అందం మెయింటెయిన్ చేయడంలో ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచింది సుష్. ఆమె ముద్దుపేరు అదేలెండి. నచ్చినోళ్లతో అలా పిలిపించుకోవడం చాలా ఇష్టం ఆమెకి.

కెరీర్ లో సక్సెస్ లు చాలానే ఉన్నా.. పర్సనల్ లైఫ్ లో ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికి 10 సార్లు సుష్ లవ్ స్టోరీ ఫెయిలైంది. పదో వ్యక్తి ముంబైలో రెడ్ లైట్ అనే నైట్ క్లబ్ కి ఓనర్. ఇతనితో కూడా విడిపోయిందిపుడు. అఫ్ కోర్స్ ఈ పదింటిని ఫెయిల్యూర్స్ అని సుశ్మితాసేన్ ఒప్పుకోదు లెండి. జస్ట్ మనసులు కలవలేదని చెబ్తుంది. ఇంతకీ మిగతా 9మంది ఎవరు అనుకుంటున్నారా.. చదవండి మరి.

1. దస్తక్ షూటింగ్ సమయంలో విక్రమ్ భట్ తో సాన్నిహిత్యం ప్రేమగా మారింది. సుశ్మిత కోసం పెళ్లాం పిల్లలను వదిలేసిన భట్.. తర్వాత ఈమెతోనూ విడిపోవాల్సి వచ్చింది.

2. సంజయ్ నారంగ్ అనే హోటల్ వ్యాపారితో ఎంగేజ్ మెంట్ జరిగిందని టాక్ ఉంది. కానీ ఇది పెళ్లి వరకూ రాలేదు.

3. సబీర్ భాటియా హాట్ మెయిల్.కాం ఓనర్ సబీర్ భాటియాతో చక్కర్లు కొట్టాక.. వుయ్ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అనేసింది.

4. వయసులో చాలా చిన్నవాడైన రణ్ దీప్ హుడాతో వరుసగా సినిమాలు చేసి.. తర్వాత బైబై చెప్పేయడంతో.. ఇతగాడికి కోలుకోవడానికి చాలాకాలమే పట్టింది.

5. బిజినెస్ మ్యాన్ ఇంతియాజ్ ఖత్రితో ప్రేమ వ్యవహారం నెలల కాలంలోనే తేలిపోయింది.

6. మానవ్ మీనన్ అనే వ్యక్తితో అయితే వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది సుశ్మిత. రాణీ లక్ష్మీబాయ్ అనే మూవీ స్టార్ట్ చేసి మానవ్ ని నిర్మాతగా కూడా మార్చింది. ఈ మూవీ తెరకెక్కలేదు. ఆ రిలేషన్ నిలబడలేదు.

7. గ్లోబస్పోర్ట్స్ అనే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బంటీ సచ్ దేవతో కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిచినా.. అతగాడికి నేహాధూపియా, దియామీర్జాలు కూడా నచ్చడంతో.. సుశ్మిత వెనక్కు తగ్గింది.

8. ముదాసర్ అజీజ్ ని ఫైనల్ బాయ్ ఫ్రెండ్ అనుకున్నారంతా. ఎందుకంటే సుశ్మిత పెంపుడు కూతురుకు కూడా ఇతను బాగా దగ్గరయ్యాడు. అయినా మళ్లీ కథ మొదటికే వచ్చింది.

9. ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా టీవీ షో తర్వాత పాక్ క్రికెటర్ వసీం అక్రంతో ప్రేమలో పడింది సుష్. ఒకరికి ఒకరు సరిపడరని తెలుకున్నాక ఎంచక్కా విడిపోయారు.

10. రితిక్ భాసిన్.. 18 నెలల రిలేషన్ తర్వాత సుశ్మిత రితిక్ లు వీడ్కోలు పలికేసుకున్నారు.

ఇదీ ఒక భామ-పది సార్లు ప్రేమ కధ.