Begin typing your search above and press return to search.

మాజీతో సుస్మితాసేన్ షాపింగ్..ల‌లిత్ మోదీ ఏమైన‌ట్లు?

By:  Tupaki Desk   |   29 Aug 2022 3:30 PM GMT
మాజీతో సుస్మితాసేన్ షాపింగ్..ల‌లిత్ మోదీ ఏమైన‌ట్లు?
X
మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్ ప్రేమాయాణాలు..వాటి బ్రేక‌ప్ స్టోరీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నెలరోజుల క్రిత‌మే రోహ‌మాన్ షాల్ కి బ్రేక‌ప్ చెప్పి జీవితంలోకి ల‌లిత్ మోదీని ఆహ్వానించింది సుస్మిత‌. ప్ర‌స్తుతం సుస్మిత ఖాతాలో ల‌లిత్ 11వ బోయ్ ప్రెండ్. ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్ కొన‌సాగుతుంది. ఈ విష‌యాన్ని ఇద్ద‌రూ అధికారికం చేసిన సంగ‌తి తెలిసిందే.

కానీ తాజాగా సుస్మిత మ‌రో ట్విస్ట్ ఇచ్చింది. ప్ర‌స్తుతాన్ని ప‌క్క‌న‌బెట్టి మాజీని మ‌ళ్లీ లైన్ లోకి తెస్తుందా? అన్న సందేహం వ‌చ్చేలా ఓ డౌట్ క్రియేట్ చ‌స్తుంది. అవును. సుస్మితా సేన్-రోహ‌మాన్ షాల్ ఇద్ద‌రు జంట‌గా షాపింగ్ చేసిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. వారితో వాళ్లిద్ద‌రి బిడ్డ రేని సైతం ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి దూరి కెమెరాకి ఫోజులిచ్చింది.

బిడ్డ అంటే సుస్మిత ద‌త్త పుత్రిక‌. రోహ‌మాన్ తో రిలేష‌న్ కొన‌సాగిన టైమ్ లోనే రేనిని ద‌త్త‌త తీసుకుంది. అలా రోహ‌మాన్ షాల్ తండ్రి అయ్యాడు. ఈ ముగ్గురు క‌లిసి షాపింగ్ చేసారు. మాల్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోన్న స‌మ‌యంలో ఫోటోగ్రాఫర్లు స్టిల్స్ ఇవ్వ‌మ‌ని అడిగితే వాళ్ల మాట కాద‌న‌కుండా న‌వ్వుతూ ఫోజ‌లిచ్చింది సుస్మిత‌.

ఈ స‌మ‌యంలో ముగ్గుర్ని ప‌క్క‌ప‌క్క‌నే నుంచోబెట్టి మ‌రీ ఫోటోలు తీసారు చాయాగ్రాహ‌కులు. అయితే ఇలా ముగ్గురి క‌ల‌యిక నెటి జ‌నుల్లో ఎన్నో సందేహాల‌కు తావిస్తోంది.

నెట్టింట ఆస‌క్తికర‌ కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. రోహ‌మాన్ ఇక్క‌డ ఉంటే అక్క‌డ ల‌లిత్ సంగ‌తేంటి? రోహ‌మాన్ ని చూస్తుంటే బాధగా ఉంద‌ని కొంద‌రు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ప‌క్క‌నున్న వారంతా ఆ సెల‌బ్రిటీ జంట‌లో ఎవ‌రికో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సుస్మిత..రోహ‌మాన్ బ‌ర్త్ డే ఇప్పు డు కాదు. బ‌హుశా రేని బ‌ర్త్ డే అవ్వొచ్చు అందుకే ముగ్గురు క‌లిసి షాపింగ్ వ‌చ్చి ఉండొచ్చు. రేనితో రోహామాన్ చాలా క్లోజ్ గా ఉంటాడు. తండ్రి సంబంధం కాబ‌ట్టి ఆ రిలేష‌న్ ఎక్క‌డా చెడ‌కుండా సుస్మిత పిలుపు కాద‌న‌లేక షాపింగ్ వ‌చ్చి ఉండొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.