Begin typing your search above and press return to search.

అందం మెయింటెనెన్స్ అంటే ఇదీ!

By:  Tupaki Desk   |   26 Sept 2017 12:59 PM IST
అందం మెయింటెనెన్స్ అంటే ఇదీ!
X
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ రీసెంట్ గా హైద్రాబాద్ వచ్చింది. ఓ స్టోర్ లాంఛింగ్ ఈవెంట్ కోసం ఈ మాజీ మిస్ యూనివర్స్ ను ఆహ్వానిస్తే.. అందుకు సై అన్న సుస్మిత.. హైద్రాబాద్ లో సందడి చేసింది. మరి ఈవెంట్ అన్నాక.. బాలీవుడ్ భామలు గ్లామర్ కురిపించడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

కానీ ఇక్కడ సుస్మిత వయసు 41 సంవత్సరాలు అనే పాయింట్ మర్చిపోకూడదు. మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈమె దక్కించుకుని ఇప్పటికి 23 ఏళ్లు నిండిపోయింది. అయినా సరే ఇప్పటివరకూ తరగని అందంతో మెరిసిపోవడం.. అతి కొద్ది మంది మహిళా మూర్తులకు మాత్రమే పరిమితం. పైగా ఇంత వయసులోనూ అందాలను ప్రదర్శించే ధైర్యం అందరూ చేయలేరు. కానీ ఆ తెగువ మాత్రం ఈ సుందరిలో చాలానే ఉంటుంది. అందుకే రకరకాల యాంగిల్స్ నుంచి కెమేరా మెన్ ఫోటోలు తీసుకుంటున్నా ఏ మాత్రం అభ్యంతర పెట్టలేదు కదా.. వారికి మరింతగా సహకరించి.. తన ట్యాలెంట్ చూపించేసింది సుస్మితా సేన్.

అయినా.. అందగత్తె ఏ కోణం లోంచి చూసినా అందంగానే ఉంటుంది. కాకపోతే ఆ అందాన్ని కాపాడుకోవడమే చాలా ముఖ్యం. అంతలా కాపాడుకోవడానికి.. సోకులను మెయింటెయిన్ చేయడానికి బోలెడంత ట్యాలెంట్ తో పాటు కమిట్మెంట్ కావాలి. అవన్నీ పుష్కలంగా ఉన్నాయ్ కాబట్టే.. మాజీ మిస్ యూనివర్స్ అయినా.. ఇప్పటికీ మెస్మరైజ్ చేయగల ఆకర్షణను నిర్వహిస్తోంది సుస్మితా సేన్.