Begin typing your search above and press return to search.

సుస్మితా సేన్- ల‌లిత్ మోడీ జంట బ్రేక‌ప్?

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:34 PM GMT
సుస్మితా సేన్- ల‌లిత్ మోడీ జంట బ్రేక‌ప్?
X
ఈరోజుల్లో ఎప్పుడు ఏ వార్త ఎలా పుట్టుకొస్తుందో ఏది ట్రెండింగ్ అవుతుందో అర్థం కాదు. మొన్న‌టికి మొన్న త‌మ ప్రేమాయ‌ణాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన సుస్మితా సేన్ -ల‌లిత్ మోడీ జంట విడిపోయారంటూ కొత్త ప్ర‌చారం ఊపందుకుంది.

లలిత్ మోడీ తన ఇన్ స్టాగ్రామ్ బయో నుండి సుస్మితా సేన్ పేరును తొలగించడం ప్ర‌కంప‌నం రేపింది. ఈ జంట వ్య‌వ‌హారం అంతా బాగానే ఉందా.. ఏవైనా తేడాలొచ్చాయా? అంటూ నెటిజ‌నులంతా ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లింత‌కీ మోడీతో సుష్ కి ఏమైన‌ట్టు? ఏవైనా క‌ల‌త‌లు వ‌చ్చాయా? అంటూ ఆరాలు పెరిగిపోయాయి. ఇంత‌కుముందు రోహ్మ‌న్ షాల్ తోను బ్రేకప్ ముందు ఇలాంటి హింట్లు అందాయి.

సుస్మిత సుదీర్ఘ‌మైన నోట్ లో ఎంతో ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. సోష‌ల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎంత‌గా వైర‌ల్ అవుతోందో చెప్ప‌లేం. ఇప్ప‌టికి ఇది వైర‌ల్ వార్త‌. అస‌లు ల‌లిత్ మోదీ ఎందుకు అలా చేశాడు? అన్న‌దానికి ఇప్ప‌టికైతే స‌మాధానం లేదు.

వీరిద్దరూ నెలల తరబడి డేటింగ్ లో ఉన్నారు. సుస్మితా సేన్ ని త్వరలో వివాహం చేసుకోవచ్చని కూడా మోడీ హింట్ ఇచ్చారు. కానీ అది జ‌రుగుతుందా? అన్న‌దే ఇప్పుడు సందిగ్ధం. ఏదో తప్పు జరిగే అవకాశం కనిపిస్తోందని... రోహ్ మన్ షాల్ తో సుస్మితా సేన్ మళ్లీ సాన్నిహిత్యం పెంచుకుంటోంద‌ని కూడా కొంద‌రు అభిమానులు ఆశ్చర్యం వ్య‌క్తం చేయ‌డం క‌నిపిస్తోంది.

ఈ జంట గురించి ఈ వార్త ట్రెండింగ్ లో ఉండ‌గానే మ‌రోవైపు సునీల్ శెట్టి వార‌సురాలు అతియా శెట్టి - క్రికెట‌ర్ KL రాహుల్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. KL రాహుల్ -అతియా శెట్టి ఖండాలాలోని స్టార్ ఫామ్ హౌస్ జహాన్ లో వివాహం చేసుకోనున్నారు. కుటుంబ సభ్యులు వేదికను ఖరారు చేశారు. కేఎల్ రాహుల్ పెళ్లి డేట్ చెక్ చూసుకుంటున్నాడు. ఓ వెడ్డింగ్ ప్లానర్ ఆ ప్రదేశానికి రెక్కీ చేయడానికి వచ్చినట్లు చెబుతున్నారు. సునీల్ శెట్టి పెళ్లికి బాలీవుడ్ మొత్తాన్ని ఆహ్వానించబోతున్నాడని కూడా క‌థ‌నాలొస్తున్నాయి

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.