Begin typing your search above and press return to search.

సుస్మితాసేన్-ల‌లిద్ మోదీ య‌వ్వారం యెనక అంతుందా!

By:  Tupaki Desk   |   23 July 2022 1:30 AM GMT
సుస్మితాసేన్-ల‌లిద్ మోదీ య‌వ్వారం యెనక అంతుందా!
X
బాలీవుడ్ న‌టి..మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్-ల‌లిత్ మెదీ ప్రేమ క‌హానీ గురించి ప్ర‌పంచానికి తెలిసిందే. ఇంత‌కాలం గుట్టు చ‌ప్పుడు కాకుండా కొన‌సాగించిన రిలేష‌న్ గురించి ఒక్క‌సారిగా బ్లాస్ట్ చేసి షాక్ ఇచ్చారు. 46 సుస్మిత‌కి..-58 ఏళ్ల ల‌లిత్ మోదీకి లంకె ఎలా కుదిరింది? అన్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. స్నేహం ఎప్పుడు ప్రేమ‌గా మారింది? పెళ్లికి ఎలాంటి ప‌రిస్థితులు దారి తీస్తున్నాయి? సుస్మిత ఖాతాలో 11 వ వాడిగా లిలిత్ ఎలా లాక్! ఇలా ఎన్నో ర‌కాల సందేహాలు త‌ర‌పైకి వ‌స్తున్నాయి.

వాట‌న్నింటిని నివృతి చేసుకోవ‌డం అన్న‌ది ఇప్ప‌ట్లో క‌ష్టంగానీ...త‌మ‌క‌న్నా వ‌య‌సులో పెద్ద‌వాడైన వాళ్ల‌ను అమ్మాయిలు ఎందుకు ఇష్ట‌ప‌డ‌తారు? అన్న దానికి మాత్రం నిపుణులు ఆస‌క్తిక‌ర బ‌ధులు చూపిస్తున్నారు. అస‌లు అమ్మాయిలు త‌మ క‌న్నా పెద్ద వాళ్ల ప‌ట్లు ఎందుకు? ఆక‌ర్షిలుతులు అవుతారు అన్న దానికి సైకాల‌జిస్టుల నుంచి ఆస‌క్తిక‌ర స‌మాధానాలే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

అమ్మాయిల‌ కంటే అబ్బాయిల్లో మెచ్చురిటీ కాస్త ఆల‌స్యంగానే వ‌స్తుందిట‌. ప‌రిణ‌తి చెందిన మ‌గ‌వారినే అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారంట‌. వ‌య‌సులో త‌మ‌క‌న్నా పెద్ద‌వారితోనే డేటింగ్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారుట‌. బంధంలో బ్రేకింగ్ రాకుండా ఉండాలంటే అలాంటి వాళ్లే క‌రెక్ట్ అని ఎక్కువ‌గ‌తా భావిస్తారుట‌. అప్ప‌టికే జీవితంలో కొన్ని అనుభ‌వాలు ఎదురైన నేప‌థ్యంలో వాటిపై వ‌చ్చిన అవ‌గాహ‌న‌తో వీలైనంత‌గా అమ్మాయిల్ని అర్ధం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారుట పెద్దోళ్లు.

అమ్మాయిల్లో హాస్యాన్ని..చిలిపిత‌నాన్ని పెద్ద వారు అయితేనే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారుట‌. చురుకైన లైంగిక జీవితం గ‌డిపిన అనుభ‌వంతో వ‌య‌సులో పెద్ద వారు యువ‌కులు కంటే కూడా శృంగారం విష‌యంలో మ‌రింత న‌మ్మ‌కంగా..స‌మ‌ర్ధ‌వంతంగా ఉంటారుట‌. ఇలాంటి వారితో ఆర్ధిక ఇబ్బందులు ఉండ‌వ‌ని అంటున్నారు.

కుటుంబ బాధ్య‌త‌ల‌న్నీ తిరిపోయి ఆర్ధిక స్థిర‌త్వం క‌ల‌గి ఉంటార‌ని..ఆ ర‌కంగా అమ్మాయిల‌కు ఓ భ‌రోసా కూడా ఉంటుంద‌ని ఎక్కువ‌గా న‌మ్ముతుంటారుట‌. ఖ‌ర్చు చేసే స్వ‌తంత్ర ఉంటుంది కాబ‌ట్టి ఎంత డ‌బ్బైనా అమ్మాయిల కోసం ఖ‌ర్చు పెడ‌తార‌న్న ఆలోచ‌న అమ్మాయిల్లో ఉంటుందిట‌. ఆ న‌మ్మ‌కంతోనే పురుషుడికి అమ్మాయిలు త‌మ హృద‌యాల్ని అంకితం చేస్తార‌ని అంటున్నారు.

అలాగే వృద్ధుల‌కు విశ్వాస స్థాయి కూడా ఎక్కువ‌గానే ఉంటుందిట‌. అమ్మాయిల్లో నిజాయితీని గ్ర‌హిస్తారుట‌. చాలా మంది యువ‌కులు సెక్స్ ని టైంపాస్ గా చూస్తే పెద్ద‌వారు మాత్రం టైంపాస్ గా చూడ‌రుట‌. ఈ విష‌యాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటార‌ని అంటున్నారు. ఇలాంటి వాళ్ల‌తో ఎమోష‌న‌ల్ గా క‌ల‌యిక ఎంతో బ‌లంగా ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు.

మ‌రి సుస్మితా సేన్ ల‌లిత్ మోదీలో ఇవ‌న్నీ చూసే ఇష్ట‌ప‌డిందా? లేక ఇంత‌కు మించిన బ‌ల‌మైన కార‌ణాలు ఏవైనా ఉన్నాయా? అన్న‌ది అమెకే తెలియాలి.