Begin typing your search above and press return to search.

అప్పుడు నాన్న చాలా డల్ గా ఉంటారు

By:  Tupaki Desk   |   19 Dec 2017 9:50 AM GMT
అప్పుడు నాన్న చాలా డల్ గా ఉంటారు
X
టాలీవుడ్ మెగా డాటర్స్ ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి బాగానే టచ్ అవుతున్నారు. ఇప్పటికే నాగబాబు కూతురు హీరోయిన్ గా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక మెగా స్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కూడా తెర వెనుక కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తూ టాలెంట్ ను నిరూపించుకుంటోంది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఇక చిరు సైరా సినిమాకు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ మెగా డాటర్ తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పింది. మొదట నాన్న సినిమాలకు దూరంగా ఉన్నపుడు 60లోకి వచ్చారు కదా విశ్రాంతి తీసుకుంటున్నారని అని అనుకున్నాం. కానీ ఆయన కొంచెం బాధగా ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత 150వ సినిమాతో మళ్లీ తెరపైకి రావడంతో అందరం చాలా సంతోషపడ్డామని అయన కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు.. అంటోంది సుష్మిత. అందుకే నాన్న గారు షూటింగుకు వెళ్తేనే తమ ఫ్యామిలీకి ఇష్టం అంటోంది.

ఇక చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. చరణ్ - నేను స్టడీ లో పూర్. మాకంటే ఎక్కువగా శ్రీజకి మర్క్స్ వచ్చేవి. తాను టాపర్. సో.. మేము ప్రోగ్రెస్ కార్డు చూపెట్టడానికి బయపడేవాళ్లం అని కూడా సుష్మిత చెప్పారు.