Begin typing your search above and press return to search.

సునీల్ హీరోయిన్ అందుకోసం వెయిటింగ్

By:  Tupaki Desk   |   5 Oct 2016 4:19 AM GMT
సునీల్ హీరోయిన్ అందుకోసం వెయిటింగ్
X

హీరోయిన్ సుష్మా రాజ్ రెండేళ్లుగా తెలుగు తమిళ్ సినీ ఇండస్ట్రీల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది కానీ.. ఇప్పటి వరకూ అమ్మడికి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. మాయ అంటూ నీలకంఠ సినిమాతో అరంగేట్రం చేసినా మాయ చేయలేకపోయింది. జోరు అంటూ సందీప్ కిషన్ జంటగా నటించినా.. జోరు మాత్రం చూపించలేదు సుష్మ. ఆ తర్వాత నాయకి మూవీలో నటించినా.. ప్రధాన నాయకి త్రిషకే కవరేజ్ దక్కింది.

కన్నడలో ఒకటి.. తమిళ్ లో రెండు మూడు.. తెలుగులో మూడు చొప్పున మొత్తం అరడజను సినిమాలు చేసినా.. గుర్తింపు దక్కించుకోలేకపోయిన సుష్మా రాజ్.. తన ఆశలన్నీ సునీల్ పై పెట్టేసుకుంది. ఈడు గోల్డ్ ఎహె చిత్రంతో ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ భామ.. ఇలాంటి రోల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది. 'నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి హోమ్లీ రోల్స్ చేస్తున్నాను. మోడర్న్ అమ్మాయి పాత్ర కోసం ఎదురుచూస్తుండగా.. దర్శకుడు వీరు పోట్ల ఈ మూవీ గురించి చెప్పారు. నా ట్యాలెంట్ చూపించడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది' అంటోంది సుష్మా రాజ్.

సునీల్ తో కలిసి డ్యాన్స్ చేసినా.. పోటీ ఇచ్చి ట్యాలెంట్ చూపించానని చెబుతున్న ఈ భామ.. 'మెకన్నాస్ గోల్డ్' పాటలో సునీల్.. రిచా పనాయ్ లతో పోటీ పడ్డానని అంటోంది. ఈడు గోల్డ్ ఎహె తర్వాత.. తన కెరీర్ పెద్ద టర్నింగ్ ఇచ్చేసుకుంటుదని సుష్మా రాజ్ నమ్మకం చూపించేస్తోందంటే.. ఏ రేంజ్ ట్యాలెంట్ చూపించిందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/