Begin typing your search above and press return to search.

సుశాంత్‌ ఆస్తులు : చంద్రుడి పై స్థలం ఇంకా చాలా చాలా..!

By:  Tupaki Desk   |   15 Jun 2020 11:30 PM GMT
సుశాంత్‌ ఆస్తులు : చంద్రుడి పై స్థలం ఇంకా చాలా చాలా..!
X
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్యను ఆయన అభిమానులు మరియు నెటిజన్స్‌ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు అంటూ ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్థికంగా మరీ ఇబ్బందులు లేవు అని మాత్రం ఆయన సన్నిహితులు మరియు స్నేహితులు చెబుతున్నారు. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ 60 కోట్లుగా పేర్కొన్నారు.

ముంబయిలో ఖరీదైన ఇంటితో పాటు రెండు లగ్జరీ కార్లు వాటి విలువ రెండు కోట్ల వరకు ఉంటుందట. ఖరీదైన బైక్‌ కూడా ఆయనకు ఉంది. చిన్నప్పటి నుండి చంద్రుడు అంటే ఉన్న అభిమానంతో చంద్రుడిని చూసేందుకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టెలిస్కోప్‌ ను చాలా ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడు. ఇక చంద్రుడిపై అంతర్జాతీయ లూనార్‌ ల్యాండ్స్‌ రిజిస్ట్రీ నుండి కొంత భూమిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికి అది ఆయన పేరుపైనే ఉంది.

ఒక్కో సినిమాకు ప్రస్తుతం 6 కోట్లకు అటు ఇటుగా పారితోషికం తీసుకుంటున్న సుశాంత్‌ ఈమద్య కాలంలో కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా తన వద్ద ఉన్న ఏ ఒక్కటి అమ్మేందుకు ఆయన సిద్ద పడలేదు. షూటింగ్స్‌ లేకపోవడంతో మరింతగా ఆర్థిక పరిస్థితి టైట్‌ అయ్యి ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు కాని అప్పులో కూరుకు పోయి ఆస్తులు పోగొట్టుకోవడం మాత్రం జరగలేదని కొందరు అంటున్నారు.