Begin typing your search above and press return to search.

రియాతో సంత‌కం.. ఇంత‌లోనే ఆత్మ‌హ‌త్య‌!

By:  Tupaki Desk   |   16 Jun 2020 7:10 AM GMT
రియాతో సంత‌కం.. ఇంత‌లోనే ఆత్మ‌హ‌త్య‌!
X
స్నేహితురాలు అని చెబుతున్న రియా చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఓ సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. సుశాంత్ ఆత్మ‌హ‌త్య అనంత‌రం ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు రూమి జాఫ‌రీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్- రియా చక్రవర్తి జంట‌గా ఓ సినిమా తీయాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసాం. ఇప్ప‌టికే ఇద్ద‌రూ సినిమా చేస్తున్నామ‌ని సంతకాలు చేశారు. మే నెలలో చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ఇప్పుడు షూటింగుల‌కు అనుమ‌తులు ఉన్నాయి కాబ‌ట్టి ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని రూమి తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం పరిశ్రమను కుంగుబాటుకు గురి చేసింది. చివరిసారిగా `చిచోర్`‌లో న‌టించాడు. అతని చివరి చిత్రం `దిల్ బెచారా` మేలో విడుదల కావాల్సి ఉండ‌గా క‌రోనా వ‌ల్ల ఆల‌స్య‌మైంది. త‌దుప‌రి రియాతో రూమి సినిమాకి సుశాంత్ కమిట‌య్యాడు.

దర్శకర‌చ‌యిత రూమీ జాఫ్రీ మాట్లాడుతూ...సుశాంత్ - రియా జంట‌తో రోమ్-కామ్ చేయాల‌నుకున్నాను. ఇందులో సుశాంత్ డ్యాన్స్ స్కిల్ ని ప్రదర్శించడానికి.. అత‌డిలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించేందుకు ఒక వేదిక ఇవ్వాల‌నుకున్నా. షారూఖ్ ఖాన్ - గోవిందాల‌కు సుశాంత్ అభిమాని కావడంతో ముహూర్తం రోజున సుశాంత్ డ్యాన్స్ బిట్ తో ప్రారంభించాల‌నుకున్నాం.. అని తెలిపారు. షారూక్ లోని న‌టుడిని గోవిందా డ్యాన్సుల్ని సుశాంత్ అమితంగా ఇష్ట‌ప‌డ‌తార‌ని రూమి వెల్ల‌డించారు. సుశాంత్ ని దృష్టిలో ఉంచుకుని రాసుకున్న స్క్రిప్టు ఇది. ఇక ఈ సినిమాని నేను ఎప్ప‌టికీ ఎవ‌రితోనూ చేయ‌లేను అంటూ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

లాక్ డౌన్ స‌మ‌యంలో సుశాంత్ స్క్రిప్టు చ‌దువుతున్నాడు. ఈ మూవీపై చాలా ఆస‌క్తిగా ఉన్నాడు.. రిహార్స‌ల్స్ కోసం ఆస‌క్తిగా ఆత్రంగా ఉన్నాన‌ని త‌న‌తో చెప్పాడ‌ని రూమి జాఫ్రీ తెలిపాడు. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మ‌హ‌త్య గురించి తెలిశాక .. ``జాగ్రత్తగా ఉండాలి`` అని తాను ఫోన్ లో సంక్షిప్త సందేశం (మెసేజ్) పంపాన‌ని తెలిపాడు. ``ల‌వ్ యు స‌ర్.. త్వ‌ర‌లో ప‌ట్టుకుంటాను నిజాన్ని!!`` అంటూ త‌న‌కు రిప్ల‌య్ ఇచ్చాడ‌ని రూమి వెల్ల‌డించారు.