Begin typing your search above and press return to search.

#సుశాంత్.. #DELETE హ్యాష్ ట్యాగ్ దేనికి?

By:  Tupaki Desk   |   15 Jun 2020 4:30 AM GMT
#సుశాంత్.. #DELETE హ్యాష్ ట్యాగ్ దేనికి?
X
ఇంకా ఆస్ప‌త్రిలో చికిత్స కొన‌సాగుతుండ‌గానే మ‌ర‌ణించార‌న్న వార్త‌లు ఎలాంటి క‌ల‌క‌లం రేపుతాయో తెలిసిందే. ఆ ప్ర‌చారం త‌ర్వాత బ‌తికి వచ్చిన వారి ఆవేద‌న ఎలా ఉంటుందో ఇంత‌కుముందు చాలా సంద‌ర్భాలు క‌ళ్ల‌కుగ‌ట్టాయి. మ‌ర‌ణించి ఆచేత‌న స్థితిలో ఉన్న మృత‌దేహాల ఫోటోల్ని లైవ్ లో చూపిస్తూ మీడియా ఆడే టీఆర్పీ ఆట‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంద‌ర్భాలున్నాయి. అలాంటిదే ఇది కూడా. ఈ ఆదివారం ఉద‌యం బాలీవుడ్ యువ‌ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ మ‌ర‌ణానంత‌రం అత‌డి ఆచేత‌న స్థితిలో ఉన్న ఫోటోలు మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ వ్య‌వ‌హారంపైనా మీడియా అతిపైనా ప‌లువురు బాలీవుడ్ స్టార్లు.. అభిమానులు తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు. ఇలాంటిది త‌గ‌ద‌ని ఆవేద‌న చెందారు.

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఇంకా ఎవ‌రూ జీర్ణించుకోలేదు. అంతా షాక్ ‌లో ఉన్నారు. ఇంకా అత‌డి ఆత్మహత్య వ్య‌వ‌హారంపై దర్యాప్తు సాగుతోంది. అతని అనూహ్య‌మైన చర్య వెనుక క‌చ్చితమైన కారణాన్ని పోలీసులు క‌నుగొనే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఈలోగానే ఆత్మహత్య వెనుక కార‌ణ‌మిదీ అంటూ మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి. పోలీసులు ఏం చెబుతారా? అని అభిమానులు.. బాలీవుడ్ వ‌ర్గాలు ఎదురు చూస్తుండ‌గానే సుశాంత్ మృతదేహానికి సంబంధించిన‌ చిత్రాలు ఇంటర్నెట్ లో వైర‌ల్ అయిపోయాయి. క‌నీసం ఆ ఫోటోల్ని బ్ల‌ర్ అయినా చేయ‌కుండా ప‌లు మీడియాల అతి బ‌హిర్గ‌త‌మైంది.

ప్ర‌స్తుతం #DELETE అనే హ్యాష్ ‌ట్యాగ్ సోషల్ మీడియా లో ట్రెండింగ్‌ లో ఉంది. ట్విట్ట‌ర్.. వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత ఫోటోలు ద‌ర్శ‌న‌మిస్తున్నందునే ఈ హ్యాష్ ట్యాగ్ వైర‌ల్ అయ్యింది. అత‌డి గ‌దిలో మంచం మీద మృత‌దేహాన్ని ఉంచిన ఫోటోలు.. మెడపై గాయం ఈ ఫోటోల్లో క‌నిపిస్తోంది. ఈ ఫోటోల్ని చూడ‌గానే అభిమానులు.. సాటి తారలు తీవ్ర క‌ల‌త‌కు గుర‌య్యారు. దీనిపై స్టార్ల స్పంద‌న అనూహ్యం. ``జ‌రిగిందేదో జ‌రిగి పోయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం గోప్యతను గౌరవించాలని అనుష్క శర్మ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుపాంత్ మృత‌ దేహానికి సంబంధించిన‌ అనుచితమైన చిత్రాలను విస్తృతంగా షేర్ చేసిన‌వారిపై ఛపాక్ ఫేమ్ విక్రాంత్ మాస్సే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న‌టుడు సోనూ సూద్ తన మీడియాలోని స్నేహితులను ఏమ‌ని అభ్య‌ర్థించారంటే.. ``తనను శాంతితో వెళ్లనివ్వండి`` అంటూ అభ్యర్థించాడు.

``ఈ రోజు మనం ఒక స్నేహితుడిని.. సహోద్యోగిని కోల్పోయాం. ఈ నష్టాన్ని పూడ్చలేం. సంచలనం చేయొద్దు అని నేను మీడియా స్నేహితులను అభ్యర్థిస్తున్నాను. ఆ చిత్రాలను షేర్ చేయొద్ద‌ని అభ్యర్థిస్తున్నాను. కళపై కలలతో ఈ నగరానికి వచ్చి చాలా సాధించిన బాలుడు మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టాడు. అతడు శాంతితో వెళ్ళనివ్వండి`` అంటూ సోనూ సూద్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ``మీరు * రాజు.. జర్నలిజం అని పిలిచే ఈ హాస్యాస్పదమైన పనిని ఆపగలరా ??? నన్ను అనూహ్యంగా అనారోగ్యానికి గురిచేస్తున్నారు… సుశాంత్ తన మంచంలో చనిపోయిన చిత్రాలను చూపిస్తారా?`` అంటూ సుశాంత్ స్నేహితుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అభిమానులు కుటుంబ స‌భ్యులు సాటి తార‌లు హ‌ర్ట‌య్యేలా అలాంటి ఫోటోల్ని వైర‌ల్ చేయ‌డం స‌రైన‌ది కాద‌న్న‌ది అంద‌రూ గ్ర‌హించాలి.