Begin typing your search above and press return to search.

మొన్న క్రికెటర్.. ఇప్పుడు స్విమ్మర్

By:  Tupaki Desk   |   13 Oct 2016 1:30 PM GMT
మొన్న క్రికెటర్.. ఇప్పుడు స్విమ్మర్
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నిధానంగా కెరియర్ లో మాంచి పొజిషన్ కే చేరుకుంటున్నాడు. ఆ మధ్యన వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం మాంచి మాంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ తన టేస్ట్ ఏంటనేది ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నాడు. ఈ మధ్యనే కి్రకెట్ క్యాపె్టన్ఎం.ఎస్.ధోని జివిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమాతో బాగా ఇంప్రెస్ చేసేశాడు.

'ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ' విజయంతో సుశాంత్ బాగా ఉవ్విళ్ళూరుతున్నాడు. పైగా సినిమాను 100 కోట్ల మార్కును ఉత్తినే దాటేసింది కాబట్టి.. ఇప్పుడు సుశాంత్ మరో స్పోర్ట్స్ పర్సన్ ఆటోబయోగ్రాఫీతో రావాలని చూస్తున్నాడట. భారత సైన్యంలో పనిచేసే మురళీకాంత్ పెట్కార్.. 1965లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో బుల్లెట్ గాయాల కారణంగా వికలాంగుడు అయిపోయాడు. అప్పటికే బాక్సింగ్ లో బాగా రాణిస్తున్న పెట్కార్.. ఆ తరువాత స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. అంతేకాదు.. 1970 కామన్ వెల్త్ గేమ్స్ లో స్విమ్మింగ్ లో మెడల్ సాధించాడు. ఇక 1972లో జరిగిన పారాలింపిక్స్ లో మనోడు ఏకంగా వరల్డ్ రికార్డు సెట్ చేసి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.

ఆ కథను ఇప్పుడు ప్రపంచానికి చెప్పడానికి సుశాంత్ సింగ్ రాజ్పుత్ రెడీ అయిపోతున్నాడు. మొత్తానికి వరుసగా రెండు బయోపిక్స్ ఒప్పుకోవడం అంటే అది సుశాంత్ కే చెల్లింది. మొన్న క్రికెటర్ గా మెరిసి.. ఇప్పుడు స్విమ్మర్ గా ఎలా మెరిపిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/