Begin typing your search above and press return to search.

హీరో గారు ప్యాంట్ లోనే..

By:  Tupaki Desk   |   5 Feb 2018 8:25 AM GMT
హీరో గారు ప్యాంట్ లోనే..
X
సినిమా ప్రపంచంలో కొంత మంది స్టార్స్ చేసే పనులు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మొన్నటి వరకు కామెంట్స్ వరకే ఉండే ఆ డోస్ ఇప్పుడు చేతల వరకు పెరిగింది.ఏ మాత్రం ఆలోచించకుండా ఫొటో షూట్స్ తో వయసుబేధం లేకుండా వైరల్ అయ్యేలా స్టీల్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ హాట్ ఫొటో షూట్స్ తో అందాలను డిఫెరెంట్ గా చూపిస్తూ షాక్ ఇస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లో అప్పుడప్పుడు హీరోలు కూడా వింత చేష్టలతో నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకుంటున్నారు.

రీసెంట్ గా అదే తరహాలో కొంచెం అమాయకంగా కనిపించే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా అందరికి షాక్ ఇచ్చాడు. ఇటీవల చేసిన ఒక ఫొటో షూట్ లో ఈ హీరో ఇచ్చిన స్టీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అంతే కాకుండా నెటిజన్స్ కి ఎలా స్పందిచాలో అర్ధం కావడం లేదు. సుశాంత్ ఇలాంటి స్టీల్ ఇచ్చాడేంటని కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్లుగా తాగేసి ఒక కుర్చీలో కూర్చొని పిస్ కొట్టేసినట్లు ఉంది.

ఇక సగం వరకు తన జీన్స్ ను తొలగించడం చూస్తుంటే ధోని హీరో అందరిని ఆకర్షించేందుకకే ఇలా చేశాడా అని అనిపిస్తోంది. ఇక ఈ హీరో కెరీర్ లో ఇంకా అనుకున్నంత రేంజ్ లో హిట్టు కొట్టడం లేదు. అయినా కూడా ఆఫర్స్ బాగానే అందుతన్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలతో సుశాంత్ బిజీగా ఉన్నాడు. అలాగే మరికొన్ని కథలలో ప్రత్యేక పాత్రలను పోషిస్తున్నాడు.