Begin typing your search above and press return to search.

నా ఫేవరేట్ సెక్స్ పొజిషన్.. 69..

By:  Tupaki Desk   |   25 May 2017 5:52 AM GMT
నా ఫేవరేట్ సెక్స్ పొజిషన్.. 69..
X
ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ మూవీతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న స్టార్ హీరో అయిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అంతకు ముందు కూడా ఈ కుర్రాడి ఖాతాలో మంచి సినిమాలు ఉన్నా.. ధోనీ తెచ్చిన క్రేజ్ వేరు. ప్రస్తుతం రాబ్తా అంటూ ఓ మూవీతో ప్రేక్షకులకు ముందుకు రానుండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనోన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఈ హీరో హీరోయిన్లు రాబ్తా ప్రమోషన్స్ లో ఉన్నారు. తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ హంగామా చేస్తున్నారు. ఓపెన్ టాక్ విషయంలో సుశాంత్ బాగా స్పీడ్ చూపించేస్తుంటాడు. ఎలాంటి టిపికల్ క్వశ్చన్ కి అయినా ఆన్సర్ చేసేయగల సత్తా ఇతగాడి సొంతం. కృతి కూడా తక్కువేమీ కాదు. తాజాగా ఫిషింగ్ ది ఆన్సర్స్ అనే కాన్సెప్ట్ తో చకచకా వీరికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో భాగంగా మీ ఫేవరేట్ సెక్స్ పొజిషన్ ఏది అనే ప్రశ్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఎదురైంది. సహజంగా అయితే హీరోలు తడుముకుంటారు కానీ.. ఆన్ స్క్రీన్ ధోనీ మాత్రం ఈ ప్రశ్నకు హెలికాప్టర్ షాట్ లాంటి ఆన్సర్ ఇచ్చాడు.

'నాకు 60ల్లో విషయాలంటే ఉష్టం. అలాగే 69 కూడా' అన్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఫేవరేట్ సెక్స్ పొజిషన్ ఏదనే ప్రశ్నకు ఇంత ఇంటెలిజెంట్ గా.. స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా సుశాంత్ ఆన్సర్ చేయడం అందరినీ అబ్బురపరిచింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/