Begin typing your search above and press return to search.

మహేష్ హీరోయిన్.. హీరో చెప్పేశాడు

By:  Tupaki Desk   |   22 April 2017 9:56 AM GMT
మహేష్ హీరోయిన్.. హీరో చెప్పేశాడు
X
మహేష్ బాబు మూవీ 1 నేనొక్కడినే చిత్రంలో నటించిన కృతి సనోన్.. ఇప్పుడు బాలీవుడ్ లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్న.. రాబ్టా మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా ప్రారంభమైనప్పటినుంచి సుశాంత్-కృతిలపై బోలెడన్ని రూమర్స్ వచ్చేశాయి.

కలిసి నటిస్తున్నపుడు లవ్ స్టోరీ నడిపిస్తున్నారనే రూమర్స్ సహజమే కానీ.. వీళ్ల స్టోరీని అంతకు మించి అనాల్సిందే. ఎందుకంటే.. వీళ్లు బ్రేకప్ చెప్పేసుకున్నారన్నది పాత గాసిప్ అయితే.. మళ్లీ వీరిద్దరినీ ఓ కాస్ట్ లీ కారు కలిపిందన్నది లేటెస్ట్ రూమర్. తాజాగా మాసెరాటి క్వాట్రొపోర్టే కొనుగోలు చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. దానిలో కృతితో కలిసి చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం. ఈ కహానీలపై ఇప్పుడీ రాబ్టా హీరో ఓపెన్ అయిపోయాడు. 'ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నేను అదే కారులో చక్కర్లు కొడుతూనే ఉన్నాను. తిరుగుతూనే ఉన్నాను. ఒక్కరంటే ఒక్కరు కూడా నా ఫోటో.. నా కారు ఫోటో తీయలేదు' అని చెప్పాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

'మా ఇద్దరిపై వస్తున్న స్టోరీ అంతా వింటే భలేగా ఉంది. మంచి కథే అయినా.. అది నిజం కాదు. తను ఓ ఇంజినీర్.. నేనూ అదే చదివా కానీ డ్రాపవుట్. ఇద్దరం ఢిల్లీ నుంచి వచ్చాం. పైగా ఫుడీస్ కూడా. అందుకే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కావడంతో కలిసి టైం స్పెండ్ చేయడం బాగుంటుంది' అని చెప్పాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/