Begin typing your search above and press return to search.

హార్ట్ ఎటాక్ తో ఆస్ప‌త్రిలో సుశాంత్ సింగ్ తండ్రి

By:  Tupaki Desk   |   21 Dec 2020 11:45 AM IST
హార్ట్ ఎటాక్ తో ఆస్ప‌త్రిలో సుశాంత్ సింగ్ తండ్రి
X
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి గుండె జబ్బుతో ఆసుపత్రి పాలయ్యారు. యువ హీరో ఆక‌స్మిక మ‌ర‌ణానంత‌రం తండ్రి కెకె సింగ్ తీవ్ర కుంగుబాటుకు లోనైన సంగ‌తి తెలిసిందే. సీబీఐ-ఎన్.సి.బి విచార‌ణ‌కు ఆయ‌న స‌హ‌క‌రించారు. సుశాంత్ త‌ర‌పున కోర్టుల ప‌రిధిలో పోరాటం సాగిస్తున్నారు.

ఇంత‌లోనే ఆయ‌న ఆస్ప‌త్రి పాల‌య్యారు. హ‌రియాణా ఫరీదాబాద్ ‌లోని ఆసుపత్రిలో చేర్చారు. కె.కె సింగ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని అతను చికిత్స పొందుతున్నట్లు సమాచారం. హాస్పిటల్ బెడ్ మీద కెకె సింగ్ తన కుమార్తెలు మిట్టు ప్రియాంక సింగ్ లతో కలిసి ఉన్న ఫోటో ఇంటర్నెట్లో వైర‌ల్ అవుతోంది.

సుశాంత్ ఆక‌స్మ‌క మ‌ర‌ణం వెన‌క కార‌ణమేమిటో ఇప్ప‌టికీ సస్పెన్స్. అది బ‌ల‌వ‌న్మ‌ర‌ణ‌మా స‌హ‌జ‌మ‌ర‌ణ‌మా? అన్న‌ది ఇంకా తేల‌లేదు. కొడుకు మరణించిన తరువాత కెకె సింగ్ పోరాటం తెలిసిన‌దే. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రియా తన కొడుకు బ్యాంక్ ఖాతా నుండి రూ .15 కోట్లు దండుకున్నార‌ని .. అతనికి స్లో పాయిజ‌న్ ఇవ్వడం ద్వారా మరణానికి కారణమయ్యార‌ని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఏవీ సిబిఐ- ఇడి -ఎన్ సిబి విచార‌ణ‌లో నిగ్గు తేల‌లేదు. మూడు దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఇప్ప‌టికీ వేరే కార‌ణాల‌పైనా ఆరాలు తీస్తున్నాయి.