Begin typing your search above and press return to search.

సుశాంత్ తో డేటింగ్ చేసింది నిజమే.. కానీ!

By:  Tupaki Desk   |   28 Sept 2020 1:40 PM IST
సుశాంత్ తో డేటింగ్ చేసింది నిజమే.. కానీ!
X
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మృతి కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రవర్తికి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పడుకునే - శ్రద్ధా కపూర్‌ - సారా అలీఖాన్‌ - రకుల్ ప్రీత్ సింగ్‌ లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అందులో భాగంగా మొన్న (సెప్టెంబర్ 26) సారా అలీఖాన్ ను ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరైంది. నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో సారా అలీఖాన్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణలో సుశాంత్‌ తో కొంతకాలం డేటింగ్ చేసినట్లు ఒప్పుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుశాంత్ తో కలిసి థాయ్‌ లాండ్‌ పర్యటనకు వెళ్లానని.. ఆ ట్రిప్ కి సుశాంత్ టీమ్ కూడా వచ్చిందని సారా స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుశాంత్ ఫార్మ్ హౌస్ లో పార్టీల కు అటెండ్ అయ్యానని.. తాను సిగరెట్స్‌ తాగాను తప్పితే డ్రగ్స్‌ ఎప్పుడూ తీసుకోలేదని సారా ఎన్‌సీబీకు తెలిపారని నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. సుశాంత్‌ తో కలిసి 'కేదార్ నాథ్' సినిమా లో నటించిన సారా అలీఖాన్‌.. షూటింగ్ బ్రేక్ సమయం లో సుశాంత్ డ్రగ్స్‌ తీసుకునే వాడని చెప్పడం గమనార్హం. ఇక మరో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ కూడా ఎన్సీబీ విచారన లో సుశాంత్ డ్రగ్స్ తీసుకునే వాడని చెప్పినట్లు తెలుస్తోంది.