Begin typing your search above and press return to search.

సుశాంత్: అసలు రియా వెనుక ఎవరున్నారు?

By:  Tupaki Desk   |   8 Sept 2020 11:45 AM IST
సుశాంత్: అసలు రియా వెనుక ఎవరున్నారు?
X
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మృతి వెనుక మిస్టరీ వీడడం లేదు. ముంబై పోలీసులు విచారించినా.. సీబీఐ విచారించినా ఈ కేసు తెగడం లేదు. రోజుకో విషయం బయటపడుతూ ఉత్కంఠ రేపుతోంది. సోమవారం ఎన్.సీ.బీ విచారణలో బాలీవుడ్ హీరోల పేర్లను రియా బయటపెట్టినట్టు సమాచారం.

సుశాంత్ మృతి కేసులో బాలీవుడ్ స్టార్ల ప్రమేయంపై రియా నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ కేసు గొప్ప మలుపు తీసుకున్నట్టైంది.

సుశాంత్ సింగ్ కు తాను డ్రగ్స్ ఇచ్చానని రియా ఒప్పుకున్నట్టు సమాచారం. తన తమ్ముడు షోవిక్ ద్వారా డ్రగ్స్ తెప్పించి సుశాంత్ కు ఇచ్చానని రియా దర్యాప్తులో అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.డ్రగ్స్ ఇచ్చానని.. తాను మాత్రం వాడలేదని రియా తెలిపినట్లు సమాచారం. సుశాంత్ వ్యవహారంలో రియా పాత్ర ఉందని తేలడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు వెనుక ఎవరు ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలీవుడ్ స్టార్లు రియాను ప్రలోభ పెట్టి ఇలా చేశారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. సుశాంత్ మరణించడానికి మానసికంగా రియా ఇబ్బంది పెట్టిందా అనే విషయంలోనూ సీబీఐ ఆరాతీస్తోంది.