Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసులో డ్రగ్స్ కుట్ర కోణంలో రియా మెడకు ఉచ్చు
By: Tupaki Desk | 27 Aug 2020 2:40 PM ISTసుశాంత్ కేసులో రియా చక్రవర్తి మెడకు అంతకంతకు ఉచ్చు బిగుసుకుంటోంది. డ్రగ్ డీలర్లతో సంబంధాలు నెరపడం.. సుశాంత్ సింగ్ కి డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ఈ కేసులో రియా మెడకు ఉచ్చు బిగుస్తోందనే ప్రచారం జోరుగా సాగిపోతోంది. ప్రస్తుతం సీబీఐ బరిలో దిగి అసలు నిజాల్ని నిగ్గు తేల్చేందుకు సీరియస్ గా కసరత్తు చేస్తుండడంతో ఈ కేసు నుంచి రియా బయటపడడం అంత సులువేమీ కాదని అర్థమవుతోంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ ఇచ్చేదని కొత్త వాట్సాప్ చాట్ వెల్లడించడంతో రియా చక్రవర్తికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రియా తన కోస్టార్ జయ సాహా మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలో డ్రగ్స్ పంపినందుకు సాహాకు రియా కృతజ్ఞతలు తెలిపింది. డ్రగ్స్ పంపినందుకు ఆనందంగా ఉంది అని రియా జయకు టెక్స్ట్ చేయగా.. `ఇది ఏమైనా సహాయపడిందా?` అంటూ రిప్లయ్ వచ్చింది. ``అవును అతన్ని కొంచెం శాంతపరిచారు`` అంటూ రియాకు మరోసారి ఆన్సర్ కూడా వచ్చింది ఆ చాట్ లో.
సాహా టాలెంట్ మేనేజర్ కావడంతో రియా తనతో క్లోజ్ గానూ మూవ్ అయ్యేదని తెలియవచ్చింది. మరో చాట్ లో రియా ఎమ్‌డిఎంఎ గురించి డ్రగ్ పెడ్లర్ గౌరవ్ ఆర్యతోనూ సంభాషించింది. మార్చి 2017 లో జరిగిన సంభాషణల్ని విశ్లేషిస్తే.. MDMA- LSD సహా ఇతర డ్రగ్స్ గురించి చాట్ లో మాట్లాడినట్టు తేలింది. రియా మరియు సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా మధ్య జరిగిన మరో సంభాషణలో సుశాంత్ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి రియా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ``మీరు క్రెడిట్ కార్డు పిన్ పంపగలరా .. నెట్ బ్యాంకింగ్ పిన్ మార్చవచ్చు.. అంటూ మిరాండాకు రియా మెసేజ్ పంపింది.
ఈ ఆధారాలు బయట పడ్డాక .. నిషేధిత మాదకద్రవ్యాల వ్యవహారాలపై దర్యాప్తు జరిపేందుకు రియా చక్రవర్తి ఇతరులపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని 20... 22.. 27 .. 29 సెక్షన్లు కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నుండి వచ్చిన అధికారిక సూచనపై ఫెడరల్ డ్రగ్ యాంటీ ఏజెన్సీ దాఖలు చేసిన ఫిర్యాదులో ఇవన్నీ ప్రస్థావనకు వచ్చాయి.
గంజాయికి సంబంధించి రూల్స్ ఉల్లంఘనకు శిక్ష (20), సైకోట్రోపిక్ పదార్ధాలకు సంబంధించి ఉల్లంఘనకు శిక్ష (22), ఏదైనా మాదకద్రవ్యాల లేదా సైకోట్రోపిక్ పదార్ధం (27) దుర్వినియోగం.. లేదా నేరపూరిత కుట్ర (29) కోణంలో రియా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తెలిసింది.
సుశాంత్ యొక్క క్రెడిట్ కార్డ్ పిన్ ను మార్చడానికి ప్రయత్నించడంపై కూడా సీరియస్ గా విచారణ సాగనుంది. రియా - సుశాంత్ జంట సేవకుడు దీపేశ్ సావంత్ మధ్య గంజాయికి సంబంధించిన సంభాషణల్లో ఒక్కో గంజాయి సంచికి 5000 రూపాయలకు కొనుగోలు చేయడం గురించి మాట్లాడారు.
రియా చక్రవర్తి ఇంటి నుండి బయలుదేరే ముందు జూన్ 8 న మోంట్ బ్లాంక్ అపార్ట్ మెంట్ లోని సుశాంత్ రాజ్‌పుత్ నివాసంలో 8 హార్డ్ డ్రైవ్ లు ధ్వంసమయ్యాయని.. దివంగత నటుడి స్నేహితుడు ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథాని ఇప్పటికే సిబిఐకి తెలిపారు. జూన్ 8 న తన ఇంటి నుండి బయలుదేరే ముందు రియా సుశాంత్ గొడవ పడ్డారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి పనిచేసిన టాలెంట్ మేనేజర్ దిశా సాలియన్ మరణించిన రోజునే చాలా విషయాలు జరిగాయని విచారణలో తేలింది. ఇదంతా చూస్తుంటే రియా మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టేనని క్లియర్ కట్ గా తేల్తోంది.