Begin typing your search above and press return to search.

షాకింగ్ న్యూస్ : 'ధోనీ' హీరో ఆత్మహత్య...!

By:  Tupaki Desk   |   14 Jun 2020 9:25 AM GMT
షాకింగ్ న్యూస్ : ధోనీ హీరో ఆత్మహత్య...!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఉరి వేసుకొని బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రస్తుత వయస్సు 34 సంవత్సరాలు. సుశాంత్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉన్నది.

కాగా 2008లో సుశాంత్ సింగ్ ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ ఒక్కసారిగా స్మాల్ స్క్రీన్ పై క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత 'కై పో చెయ్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు. 'శుద్ధ్ దేశీ రొమాన్స్' 'ఎంఎస్ ధోని' 'కేదారనాథ్' 'చిచ్చోరె' సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

కాగా లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్న సుశాంత్ గత కొన్ని రోజులుగా డిప్రెషన్ కి గురవుతూ ఉన్నాడని.. ఆయన మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని.. అందుకే ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. 34 ఏళ్ళ వయసులోనే సుశాంత్ ఈ లోకాన్ని విడిచివెళ్లడం బాధాకరమని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయిదు రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు.