Begin typing your search above and press return to search.

మ‌హేష్ హీరోయిన్ ప్రేమ‌లో పడిందా?

By:  Tupaki Desk   |   2 April 2016 6:16 AM GMT
మ‌హేష్ హీరోయిన్ ప్రేమ‌లో పడిందా?
X
రూమ‌ర్లకు కేరాఫ్ అడ్ర‌స్ బాలీవుడ్. ఈమ‌ధ్య త‌క్కువైంది కానీ... ఇదివ‌ర‌కు మాత్రం ఏ ఇద్ద‌రు క‌లిసి న‌టించినా వారి మ‌ధ్య స‌మ్‌ థింగ్ స‌మ్‌ థింగ్ అంటూ ప్ర‌చారం సాగేది. ప్రొడ్యూస‌ర్లు తెలివిగా ఆ ప్ర‌చారాన్ని సినిమా ప్ర‌మోష‌న్‌ కి వాడుకొనేవారు. అయితే ఇటీవ‌ల అలాంటి పుకార్లు త‌క్కువ‌య్యాయి. స్టార్ హీరోయిన్లలో చాలామంది ఇప్ప‌టికే రిలేష‌న్ల‌లో ఉండ‌డ‌మే కార‌ణం. కొత్త‌గా వాళ్ల‌పై పుకార్లు రావాలంటే ఇదివ‌ర‌కటి బాయ్‌ ఫ్రెండ్‌ తో విడిపోవాలి. అలా జ‌ర‌గ‌డం లేదు కాబ‌ట్టి రూమ‌ర్లు పెద్ద‌గా వినిపించ‌డం లేదు. అయితే కొత్త హీరోలు - హీరోయిన్ల మ‌ధ్య మాత్రం య‌థావిధిగా రూమ‌ర్లొస్తున్నాయి. ఆమ‌ధ్య యామీగౌత‌మ్ పెళ్ల‌యిన ఓ హీరోతో ప్రేమ‌లో ప‌డింద‌ని చెప్పుకొన్నారు. ఇప్పుడేమో మ‌న మ‌హేష్ హీరోయిన్ కృతిస‌న‌న్ గురించి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

యువ క‌థానాయ‌కుడు సుశాంత్ రాజ్‌ పుత్‌ తో కృతిస‌న‌న్ డేటింగ్ చేస్తోంద‌ని బాలీవుడ్ జ‌నాలు చెప్పుకొంటున్నారు. సుశాంత్‌ తో క‌లిసి ప్ర‌స్తుతం కృతి ఓ సినిమాలో న‌టిస్తోంది. అయితే వీళ్లు మాత్రం సినిమా షూటింగ్‌ ల‌కే ప‌రిమితం కాకుండా... బ‌య‌ట జ‌రిగే పార్టీల‌కి కూడా క‌లిసే వెళుతున్నార‌ట‌. అందుకే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌ని బాలీవుడ్ జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. సుశాంత్ రాజ్‌ పుత్ ఇదివ‌ర‌కు అంకిత అనే హీరోయిన్‌ తో ప్రేమాయ‌ణం న‌డిపాడు. అయితే వాళ్లిద్ద‌రూ ఇటీవ‌లే విడిపోయార‌నీ, అందుకే కృతిస‌న‌న్ అత‌నికి మ‌న‌సిచ్చింద‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి అందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి వుంది. తెలుగు సినిమా `1`తో ఎంట్రీ ఇచ్చిన కృతి ఇప్పుడు బాలీవుడ్‌ లో దున్నేస్తోంది. షారుఖ్‌ తో క‌లిసి న‌టించిన దిల్‌ వాలే హిట్ట‌య్యుంటే ఆమె పేరు మార్మోగిపోయేదే. కానీ దుర‌దృష్ట‌వశాత్తూ ఆ సినిమా స‌రిగ్గా ఆడ‌లేదు. అయినా స‌రే... కృతికి మాత్రం మంచి అవ‌కాశాలే వ‌స్తున్నాయి.