Begin typing your search above and press return to search.

గాళ్స్ ని వేధిస్తున్న యంగ్ డైన‌మిక్ హీరో

By:  Tupaki Desk   |   14 March 2020 5:56 AM GMT
గాళ్స్ ని వేధిస్తున్న యంగ్ డైన‌మిక్ హీరో
X
బాలీవుడ్ యంగ్ డైన‌మిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్పీడ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా గాళ్స్ లో అత‌డికి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. ప్ర‌స్తుతానికి కెరీర్ క్ష‌ణం తీరిక లేనంత స్పీడ్ గా సాగిపోతోంది. దీంతో పాటే ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఈ యంగ్ డైన‌మిక్ హీరో రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లోనూ రొమాంటిక్ గ‌య్ అన్న ప్ర‌చారం ఇప్ప‌టికే ఉంది. ప్ర‌స్తుతం యువ‌క‌థానాయిక‌ రియా చ‌క్ర‌వ‌ర్తితో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ స‌హా టాలీవుడ్ మీడియాలోనూ ప్ర‌చార‌మ‌వుతోంది.

రియా చ‌క్ర‌వ‌ర్తి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తూనీగ తూనీగ సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డికి ఆ సినిమా స‌రైన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో రియా తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్క‌డా అర‌కొర‌గా త‌న‌వైపు వ‌స్తున్న అవ‌కాశాల్ని అందిపుచ్చుకుని కెరీర్ బండిని లాగించేస్తోంది. అయినా చేస్తోన్న ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేదు. గ‌తేడాదైతే ఒక్క సినిమాతోనూ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ప్ర‌స్తుతం అమితాబ్ బ‌చ్చ‌న్..హిమేష్ ర‌ష్మియా న‌టిస్తోన్న `చెహ్రా`లో న‌టిస్తోంది. ఇదే ఇటీవ‌ల‌ అక్క‌డ బిగ్ ఆఫ‌ర్ . ఈ సినిమాపై రియా చ‌క్ర‌వ‌ర్తి బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకుంది. సుషాంత్ తో ఈ అమ్మ‌డు డేటింగ్ లో ఉంద‌న్న ప్ర‌చారం ప్ర‌స్తుతం వేడెక్కిస్తోంది.

సుషాంత్.. ఇంత‌కుముందు సైఫ్ అలీఖాన్ డాట‌ర్ సారా అలీఖాన్ తో డేటింగ్ చేసాడు. ఆ జంట కేథార్ నాథ్ చిత్రంలో న‌టిస్తోన్న స‌మ‌యంలో డేటింగ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ప్ర‌స్తుతం జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో క‌లిసి ప్ర‌యివేట్ ఆల్బ‌మ్స్ చేస్తున్నాడు. సుశాంత్ - జాకీ జంట తో తెర‌కెక్కించిన మ‌క‌నా(డ్రైవ్) వీడియో సాంగ్ ప్ర‌స్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ సాంగ్ షూట్ స‌మ‌యం లో జాకీతో సుశాంత్ మ‌రీ క్లోజ్ అయిపోయాడ‌ట‌. రియా- సారా త‌ర‌హాలోనే ఈ భామ‌ని కూడా యంగ్ హీరో వెంటాడుతున్నాడ‌ని బాలీవుడ్ మీడియాలో తాజాగా క‌థ‌నాలొస్తున్నాయి. ఇలా వ‌రుస పెట్టి గాళ్స్ ని వెంటాడ‌టంతో సుషాంత్ పేరు బాలీవుడ్ లో మార్మోగుతోంది. చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ త‌ర్వాత సుశాంత్ కి మ‌ళ్లీ ఆ ఇమేజ్ ద‌క్క‌డం విశేషం.