Begin typing your search above and press return to search.

మరింత క్షోభకు గురి చేయకండి: సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   7 July 2020 2:30 AM
మరింత క్షోభకు గురి చేయకండి: సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఫ్యామిలీ
X
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ శాలియన్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్లు, వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె ఫ్యామీలీ ఈ రోజు వీటిని కొట్టిపారేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్నదంతా అబద్దమేనని, అసత్యపు ప్రచారమని వారు పేర్కొన్నారు. ఇప్పటికే దిశ మృతికారణంగా తమ కుటుంబం ఆవేదనగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ బాధను అర్థం చేసుకోవాలని కోరింది. ఇలాంటి రూమర్స్‌కు చెక్ చెప్పాలని విజ్ఞప్తి చేసింది.

దిశ శాలియన్ జూన్ 8న ముంబైలోని తన అపార్టుమెంట్ 14వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో, పత్రికల్లో ఎన్నో వదంతులు, కుట్ర థియరీలు, ఊహాగానాలు వస్తున్నాయని, వాటిని నిలిపివేయాలని ఆ కుటుంబం కోరింది. ఇలాంటి వదంతులతో తమను మరింతగా బాధపెట్టవద్దని విజ్ఞప్తి చేసింది.

దిశ మరణం తమ కుటుంబాన్ని దుఃఖంలో ముంచిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, కానీ ఈ వార్తలు తమను మరింత క్షోభకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దిశ తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నారని, కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలు ఇకనైనా నిలిపివేయాలని కోరారు. ఈ లేఖలోదిశ శాలియన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు విజ్ఞప్తి చేశారు.