Begin typing your search above and press return to search.

నాగ్ మేనల్లుడి ఎదురు చూపులు ఫలించాయ్

By:  Tupaki Desk   |   13 Dec 2018 11:00 PM IST
నాగ్ మేనల్లుడి ఎదురు చూపులు ఫలించాయ్
X
హీరోగా నిలదొక్కుకోవవాలని పుష్కర కాలం నుంచి పోరాడతున్నాడు సుశాంత్. ఐతే అతడి మొదటి నాలుగు సినిమాలూ చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఐతే ఈ ఏడాది వచ్చిన ‘చి ల సౌ’ సుశాంత్ కు కొంచెం ఊరటనిచ్చింది. ఇంతకుముందు సుశాంత్ చేసిన రొడ్డ కొట్టుడు సినిమాల టైపు కాదిది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ కొత్తగా కనిపించాడు. మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కథల ఎంపికలో తన అభిరుచిని కూడా ఈ సినిమాతో చాటి చెప్పాడు. పెద్ద కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయినా.. ‘చి ల సౌ’ నాగ్ మేనల్లుడికి రిలీఫ్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఈ సినిమాతో వచ్చిన పేరును నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు సుశాంత్. తర్వాతి సినిమా కోసం అతను టైం తీసుకున్నాడు.

కొన్ని నెలల అన్వేషణ తర్వాత అతడికి ఓ కథ దొరికింది. తన తర్వాతి సినిమాకు మరింత వైవిధ్యం చూపించబోతున్నట్లు సుశాంత్ తెలిపాడు. ఈసారి మల్టీజానర్ ఫిలిం చేయనున్నట్లు అతను వెల్లడించాడు. తనకో ఎగ్జైటింగ్ స్క్రిప్ట్ దొరికిందని తెలిపాడు. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తానని చెప్పాడు. తన కెరీర్ ఇకపై జెట్ స్పీడులో సాగిపోతుందని చెప్పనని.. అదే సమయంలో మరీ నెమ్మదిగానూ వెళ్లనని.. మీడియం స్పీడుతో సినిమాలు చేసుకుంటూ సాగుతానని సుశాంత్ తెలిపాడు. మరి ఇంతకీ సుశాంత్ ను అంతగా ఎగ్జైట్ చేసిన స్క్రిప్టు చెప్పిందెవరో? తొలి నాలుగు సినిమాల్ని సొంత బేనర్లోనే చేసిన సుశాంత్.. ఒక్క విజయం కూడా అందుకోలేదు. బయటి బేనర్లో ‘చి ల సౌ’ చేశాడు. అది సక్సెస్ అయింది. ఈసారి కూడా అతడిని నమ్మి వేరే నిర్మాత సినిమాను ప్రొడ్యూస్ చేస్తాడేమో చూడాలి.