Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసులో ముంబై పోలీసుల గురించి సంచలన విషయాలు వెల్లడించిన లాయర్...!

By:  Tupaki Desk   |   29 July 2020 2:30 PM GMT
సుశాంత్ కేసులో ముంబై పోలీసుల గురించి సంచలన విషయాలు వెల్లడించిన లాయర్...!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సూసైడ్ కేసుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ కేసుని సీబీఐకి ఇవ్వాలని ప్రధానమంత్రికి కూడా లేఖ రాసారు. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో పోలీస్ స్టేషన్ లో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెపై ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పాట్నా పోలీసులు విచారణ నిమిత్తం ముంబైకి చేరుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా సుశాంత్‌ తరపు న్యాయవాది వికాస్‌ సింగ్‌ ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''ముంబై పోలీసులు కేసును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. లాజికల్‌ ఎండ్‌ కోసం ప్రయత్నించడం లేదు. ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటివరకు ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయలేదు. ఈ కేసులో భాగంగా ముంబై పోలీసులు ఐదు ఆరు పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ ల మీద ఆరోపణలు చేయాలని సుశాంత్‌ తండ్రి మీద అతని కుటుంబం మీద ఒత్తిడి తెస్తున్నారు. రియాను వదిలి పెట్టండి.. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ల మీద ఆరోపణలు చేయండి అంటున్నారు. ఈ కేసుకు ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ లకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే ప్రొడక్షన్‌ హౌస్‌ లకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయాల్సిన అవసరం సుశాంత్‌ కుటుంబానికి లేదు'' అని వెల్లడించారు.

''రియా వచ్చాకే సుశాంత్‌ కుటుంబ సభ్యులు అతడిని కలవలేకపోయారు. నేరం కూడా అప్పుడే ప్రారంభమయ్యింది. రియా ఉద్దేశపూర్వకంగానే సుశాంత్‌ ను కొంతకాలం అతడి తండ్రితో మాట్లాడకుండా ఆపింది. ఈ పరిస్థితులను చూసి ఆందోళన చెందిన సుశాంత్‌ ఫ్యామిలీ సభ్యులు అతడి చుట్టూ ఉన్నవారు మంచి వారు కాదని ఫిబ్రవరి 25న బాంద్రా పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ కుటుంబం రియాపై సుదీర్ఘమైన కేసు నమోదు చేసింది. ఆమె అతడి మనస్సును ఎలా చేంజ్‌ చేసింది.. సుశాంత్‌ ఇంట్లో పని చేసేవారిని.. బాడీగార్డులను మార్చిన అంశం గురించి.. సుశాంత్ అకౌంట్‌ నుంచి డబ్బును ఎలా డ్రా చేసింది.. అతడి క్రెడిట్‌ కార్డ్స్‌ ఎలా వాడుకుంది వంటి అంశాల గురించి పోలీసులకు వెల్లడించారు'' అని వికాస్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ''రియా అతడిని డాక్టర్స్ వద్దకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించింది. కానీ సుశాంత్‌ కుటుంబ సభ్యులకు దీని గురించి చెప్పలేదు. చివరకు అతను ఏ మెడిసిన్ తీసుకోవాలన్నది కూడా రియానే నిర్ణయించింది. మా అనుమానం ఏంటంటే సుశాంత్‌ సాధారణమైన మందులు కాక కొన్ని తీవ్రమైన మందులు వాడి ఉంటారని భావిస్తున్నాం'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ''బీహార్ పోలీసులు కూడా ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయడానికి మొదట్లో భయపడ్డారని.. కానీ తర్వాత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌.. మంత్రి సంజయ్‌ జోక్యం చేసుకుని ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు అయ్యేలా చూసారని తెలిపారు. అంతేకాకుండా ఈ కేసును పాట్నా పోలీసులు విచారించాలని కోరుతున్నామని.. రియాను అరెస్ట్‌ చేయాలని సుశాంత్‌ కుటుంబం కోరుతోంది.. ఈ రోజు రియాను అరెస్ట్‌ చేస్తారని మేము అనుకుంటున్నాం'' అని లాయర్ వికాస్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు.