Begin typing your search above and press return to search.

'సింపతీ'తోనే సుశాంత్ సినిమా రికార్డులు సృష్టిస్తోందా..??

By:  Tupaki Desk   |   22 July 2020 5:30 PM GMT
సింపతీతోనే సుశాంత్ సినిమా రికార్డులు సృష్టిస్తోందా..??
X
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆఖరి సినిమా దిల్ బేచారా. ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దిల్ బేచారా ట్రైలర్ ప్రపంచ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ 70 లక్షలకు పైగా వ్యూస్.. 10 మిలియన్ల పైగా లైక్స్ సొంతం చేసుకొని వరల్డ్ రికార్డు సృష్టించింది. డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. సరిగ్గా రాత్రి 7:30 గంటలకు దిల్ బేచారా ప్రసారం కాబోతుంది. సుశాంత్ సరసన సంజన సంఘీ హీరోయినుగా ఇండస్ట్రీకి తొలిపరిచయం అవుతోంది.

దిల్ బెచారా స్ట్రీమింగ్ ప్రీమియర్ తేదీ టైం అందరికి తెలుసు. ఈ మూవీ విడుదలకు కూడా పెద్దగా సమయం లేదు. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ వ్యూషిప్ రాబట్టనుందట. ఇప్పటి వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారి కొత్తగా ప్రారంభిస్తున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మల్టీప్లెక్స్ లో ఇదే రికార్డు ఓపెనింగ్స్ సాధిస్తుందని అంటున్నారు. ఈ మూవీ తర్వాత విడుదల కాబోయే వేరే సినిమాలను కూడా అదే టైమింగ్ కొనసాగిస్తారట. ప్రస్తుతం దిల్ బెచారాతో పాటు మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయట. నిజానికి దిల్ బేచారా ఫస్ట్ లుక్ నుండి కూడా నెట్టింట సంచలనం రేపుతోంది.

కానీ ఇదంతా మెయిన్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మృతి పట్ల సానుభూతితో వచ్చిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ రకంగా ట్రైలర్ ప్రపంచ రికార్డు సృష్టించడానికి కారణం కూడా సుశాంత్ మృతి పట్ల సింపతీనే. ఈ మూవీతో ప్రముఖ కాస్టింగ్ ఏజెంట్ ముఖేష్ ఛబ్రా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' అనే మూవీకి రీమేక్. అదే పేరుతో రాసిన ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఇక ఈ ఎమోషనల్ లవ్ డ్రామాను ఫాక్స్ స్టార్ స్టూడియస్ నిర్మిస్తోంది.