Begin typing your search above and press return to search.

9ఏళ్లకు సెన్సేషనల్ బ్యూటీ టాలీవుడ్ రీఎంట్రీ..??

By:  Tupaki Desk   |   4 Jun 2021 8:00 AM IST
9ఏళ్లకు సెన్సేషనల్ బ్యూటీ టాలీవుడ్ రీఎంట్రీ..??
X
సుశాంత్ సింగ్ ప్రేయసిగా వార్తల్లో నిలిచిన రియా చక్రవర్తి.. గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది. మొదట వీజేగా కెరీర్ స్టార్ట్ చేసిన రియా.. 2012లో తూనిగ తూనిగ అనే సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆ సినిమానే అమ్మడికి తెలుగులో ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. అప్పటినుండి రియా మళ్లీ తెలుగులో మరో సినిమా చేయలేదు. ఆ తర్వాత 2013లో 'మేరే డాడ్ కి మారుతీ' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అలా వరుసగా బాలీవుడ్ లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ సోనాలీ కేబుల్ - దుబారా - హాఫ్ గర్ల్ ఫ్రెండ్ - బాంక్ చోర్ - జలేబి వంటి సినిమాలు చేసింది.

కానీ ఇంతవరకు ఇండస్ట్రీలో అమ్మడికి తగిన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే అమ్మడు ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 2018లో వచ్చిన జలేబి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రియా ప్రస్తుతం 'చెహరే' అనే సినిమాలో నటిస్తుంది. అయితే సుశాంత్ సింగ్ మరణం తర్వాత రియా ఏ సినిమాలోను కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ రియా తెలుగులో రీఎంట్రీ ప్రయత్నం చేస్తోందట. అలాగే ఈ భామను తెలుగులోకి ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ రీఇంట్రడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ టాల్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

వరుసగా ఒక్కో సినిమా కంప్లీట్ చేస్తూ రిలీజుకు సిద్ధం చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు సినిమాలు నిర్మిస్తున్నాడు రానా. ప్రస్తుతం రానా పలువురు నూతన దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆ సినిమాలలో ఓ సినిమాతో రియాను మళ్లీ టాలీవుడ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రానా ప్లాన్ చేస్తున్న సినిమా కూడా ఓ యధార్థ సంఘటనల ఆధారంగా దర్శకులు స్క్రిప్ట్ రెడీ సిద్ధం చేస్తున్నారని టాక్. చూడాలి మరి త్వరలోనే ఈ వయ్యారి టాలీవుడ్ రీఎంట్రీ చేయనుందేమో!