Begin typing your search above and press return to search.

సాంగ్ అంతా 'సింగిల్ టేక్' లో చేసిన సుశాంత్..!!

By:  Tupaki Desk   |   10 July 2020 4:00 PM GMT
సాంగ్ అంతా సింగిల్ టేక్ లో చేసిన సుశాంత్..!!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ గత నెల 14న తన ఇంట్లో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. డిప్రెషన్ కి లోనై సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటం సినీ ఇండస్ట్రీలలో కలకలం రేపింది. కేసును విచారించిన ముంబై పోలీసులు కూడా సుశాంత్ తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడని.. ఇది హత్య కాదని నిర్ధారించారు. సుశాంత్ మరణాన్ని ఇండస్ట్రీలో.. ఇండస్ట్రీ బయట ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలచివేస్తుంది. సుశాంత్ మృతి పట్ల అతనితో పనిచేసిన సహనటులు.. హీరోయిన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ స్పందన అద్భుతంగా ఉంది. తాజాగా ఈ దిల్ బేచారా టైటిల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.

ఆ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే ఈ పాటలో సుశాంత్ పెర్ఫార్మన్స్ అద్భుతం అని నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఎందుకంటే 2:44 నిముషాల నిడివి గల ఈ సాంగ్ లో సుశాంత్ సింగిల్ టేక్ లో పెర్ఫార్మ్ చేసాడట. కేవలం కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకొని ఒకే టేక్ లో షూట్ చేయడం విశేషం. సింగిల్ టేక్ యాక్టర్ సుశాంత్ అని నెట్టింట అతని టాలెంట్ కి బ్రహ్మరధం పడుతున్నారు సినీప్రియులు. ఇదిలా ఉండగా.. 'దిల్ బేచారా' సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. ముఖేశ్ చాబ్రా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏదేమైనా టాలెంటెడ్ యాక్టర్ లోటు ఎవరు పూడ్చలేరని అంతా భావిస్తున్నారు.