Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ హీరో ఇంట్లో వైరస్‌ పాజిటివ్‌ కలకలం

By:  Tupaki Desk   |   24 Jun 2020 11:00 AM IST
టాలీవుడ్‌ హీరో ఇంట్లో వైరస్‌ పాజిటివ్‌ కలకలం
X
దేశ వ్యాప్తంగా కూడా మహమ్మారి వైరస్‌ పాజిటివ్‌ ల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కేసుల సంఖ్య రోజుకు వేలల్లో నమోదు అవుతున్నారు. ఇన్ని రోజులు టాలీవుడ్‌ సేఫ్‌ గా ఉందనుకుంటున్నా కూడా తాజాగా తెలుగు సినిమా ప్రముఖులు కూడా వైరస్‌ భయంతో వణికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవలే బండ్ల గణేష్‌ కు పాజిటివ్‌ వచ్చిన విషయం తెల్సిందే. ఆయన కుటుంబ సభ్యులకు నెగటివ్‌ రావడం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

టీవీ ఆర్టిస్టు ప్రభాకర్‌ కు కూడా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇండస్ట్రీలో చాలా కేసులే నమోదు అవుతున్నాయి కాని బయటకు రానివ్వడం లేదు అనేది కొందరి వాదన. తాజాగా ఒక టాలీవుడ్‌ హీరో తల్లిదండ్రులు ఇద్దరికి కూడా వైరస్‌ నిర్థారణ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందట. దాంతో ప్రస్తుతం వారిద్దరు కూడా ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారట. వారికి ఎలాంటి ఇబ్బంది లేదని అలాగే హీరోకు కూడా టెస్టు నెగటివ్‌ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌.

ఇన్ని రోజులు షూటింగ్స్‌ లేకుండా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తి టాలీవుడ్‌ ప్రముఖుల్లో తక్కువగా ఉంది. కాని షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి కనుక ఇకపై కేసుల సంఖ్య టాలీవుడ్‌ లో కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మెడిసిన్‌ రావడంతో పాటు వైరస్‌ వల్ల ప్రాణాలకు ప్రమాదం తక్కువగా ఉండటం వల్ల షూటింగ్స్‌ చేసేందుకే సిద్దం అవుతున్నారు. ప్రభుత్వాలు ప్రకటించినట్లుగా వైరస్‌ తో సహజీవనం తప్పదని అంతా కూడా ముందుకు సాగుతున్నారు.