Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడు బాలా రుణం తీర్చుకుంటున్న సూర్య‌

By:  Tupaki Desk   |   31 Aug 2021 11:05 AM IST
ద‌ర్శ‌కుడు బాలా రుణం తీర్చుకుంటున్న సూర్య‌
X
త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ బాలా దేశంలోనే యూనిక్ నెస్ ఉన్న అరుదైన ద‌ర్శ‌కుడిగా తొలి నుంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న ఎంపిక చేసుకునే క‌థాంశాల్లో డీప్ ఇంటెన్స్ ఎమోష‌నల్ డ్రైవ్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. మాస్ ర‌గ్గ్ డ్ క‌థాంశాల్ని ఎంచుకున్నా క్లాస్ ని మెప్పించ‌గ‌లిగే స‌త్తా అత‌డి క‌థ‌ల‌కు ఉంది. శివ‌పుత్రుడు -వాడు వీడు లాంటి సినిమాల‌తో అత‌డు చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

బాలా త‌న సినిమాల‌తో అత్యంత వివాదాస్పద ద‌ర్శ‌కుడిగానూ పాపుల‌ర‌య్యారు. బాలా ఇప్ప‌టికే సూర్య క‌థానాయ‌కుడిగా మూడు సినిమాలు చేశారు. ఇప్పుడు నాలుగో చిత్రానికి ఆయ‌న స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి సూర్య‌కు చెందిన నిర్మాణ సంస్థ ఈ సినిమాని తెర‌కెక్కిస్తుంది. ఇందులో అధ‌ర్వ ప్ర‌ధాన హీరోగా క‌నిపిస్తారు. కాగా సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక కెరీర్ ఆరంభం నుంచి బాలాతో సూర్య‌కు గొప్ప అనుబంధం ఉంది. ఇటీవ‌లే జ్యోతిక నటించిన 2018 థ్రిల్లర్ డ్రామా `నాచియార్` కు బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించిది. అందుకే ఇప్పుడు సూర్య నటించినా న‌టించ‌క‌పోయినా తన హోమ్ బ్యానర్ లో బాలా చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ చిత్రం బ‌ల‌మైన‌ సామాజిక సమస్య నేప‌థ్యంలో రూపొంద‌నుందని తెలిసింది. కొంతమంది కొత్త కుర్రాళ్లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య ఈ సినిమాలో నటిస్తారా లేదో తెలియదు కానీ అతను ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించాలని భావిస్తున్నారు.

ఇటీవ‌లే చియాన్ విక్ర‌మ్ వార‌సుడి లాంచింగ్ మూవీ `వ‌ర్మ‌`కు బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ ఆ స‌మ‌యంలో వివాదం గురించి తెలిసిన‌దే. అర్జున్ రెడ్డి రీమేక్ గా రూపొందించిన ఈ చిత్రంలో ఇంటెన్సిటీ మిస్స‌య్యింద‌ని మొత్తం సినిమాని స్క్రాప్ లో వేసి తిరిగి వేరొక ద‌ర్శ‌కుడితో రూపొందించారు. అయితే దీనిపై బాలా తీవ్రంగా హ‌ర్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఒక జాతీయ ఉత్త‌మ ద‌ర్శ‌కుడికి మేక‌ర్స్ తో ఈ స్థాయి విభేధాలు త‌లెత్త‌డం ప్రొడ‌క్ట్ పైనా ప్ర‌భావం చూపించింద‌ని కూడా ప‌లువురు విశ్లేషించారు. బాలా ప్ర‌తిభ గురించి ఎవ‌రికీ ఎలాంటి సందేహాల్లేవ్. అందుకే ఇప్పుడు సూర్య త‌న సొంత బ్యాన‌ర్ లో అతడితో వ‌రుస సినిమాలు నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది. త‌న‌కు కెరీర్ ప‌రంగా కీల‌క‌మైన ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించిన బాలా రుణం తీర్చుకునేందుకు సూర్య ప్ర‌య‌త్నిస్తున్నారు.