Begin typing your search above and press return to search.

సైలెంట్ అయిన సూర్య బూతులు..!

By:  Tupaki Desk   |   28 May 2019 1:31 PM GMT
సైలెంట్ అయిన సూర్య బూతులు..!
X
తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం 'NGK' మే 31 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధిస్తుందని 'NGK' టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి 'U' సర్టిఫికేట్ ను జారీ చేశారు.

ఈ సినిమాకు కొన్ని కట్స్ సూచించిన సెన్సార్ వారు.. కొన్ని అభ్యంతరకరమైన పదాలను మ్యూట్ చేయాలని చెప్పారట. ఆ సూచనలకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ సినిమాకు 'U' సర్టిఫికేట్ వచ్చిందని సమాచారం. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చేలా చేశాయి. తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగింది. మరి ఈ సినిమాతో సూర్య మళ్ళీ తెలుగులో తన సత్తా చాటుతాడా అనేది వేచి చూడాలి.

సాయి పల్లవి.. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కేకే రాధా మోహన్ రిలీజ్ చేస్తున్నారు.